India vs England: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. కపిల్ దేవ్‌ను అధిగమించి! టాప్‌లో వీరేందర్ సెహ్వాగ్!!

హైదరాబాద్: ఐదు మ్యాచుల టెస్ట్ సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో రోహిత్ కళ్లుచెదిరే రీతిలో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా సిక్స్‌గా మలిచాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో రోహిత్ సిక్సుల సంఖ్య 62కు చేరుకుంది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను అధిగమించాడు.

కపిల్ దేవ్‌ను అధిగమించిన రోహిత్:
టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ టెస్టుల్లో 90 సిక్సులు బాదాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మహీ 78 సిక్సులు కొట్టాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 69 సిక్సులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచుకు ముందువరకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రోహిత్ శర్మ 61 సిక్సులతో నాలుగో స్థానంలో ఉండేవారు. ఇప్పుడు కపిల్ దేవ్‌ను అధిగమించిన రోహిత్.. నాలుగో స్థానంలోకి దూసుకొచ్చాడు. 57 సిక్సులతో మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఉన్నాడు.

మెకల్లమ్1:
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా బ్రెండన్ మెకల్లమ్ రికార్డుల్లో ఉన్నాడు. న్యూజీలాండ్ మాజీ సారథి మెకల్లమ్ టెస్టుల్లో 107 సిక్కులు కొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (98), దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ (97), భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (90) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. క్రిస్ గేల్ ఇంకా రిటైర్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మొదటి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ప్లేయర్స్ రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ మరియు బెన్ స్టోక్స్ కూడా దిగ్గజాలను అధిగమించే అవకాశం ఉంది.
550 సిక్సులు బాదిన క్రిస్ గేల్:
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో కలిపి) అత్యధిక సిక్సర్లు బాదింది యూనివర్సల్ బాస్ క్రిస్ గేలే. గేల్ ఇప్పటివరకు 550 సిక్సులు కొట్టాడు. పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది 476 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (438), బ్రెండన్ మెకల్లమ్ (398), ఎంఎస్ ధోనీ (359) టాప్-5లో ఉన్నారు. క్రిస్ గేల్ ఇంకా ఆడుతున్నాడు కాబట్టి అతడు మరిన్ని సిక్సులు బాదే అవకాశముంది. రోహిత్ మాత్రం గేల్ దరిదాపుల్లోకి వెళ్లకపోయినా.. మెకల్లమ్ అధిగమిస్తాడు.

రోహిత్ ర్యాంప్ షాట్:
ఈ సిరీస్‌లో ఎక్కువగా ఫుట్ షాట్లు ఆడుతూ వికెట్ చేజార్చుకుంటున్న రోహిత్ శర్మ.. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఓవర్టన్ బౌలింగ్‌లో ఫుల్ షాట్ ఆడి పేలవంగా ఔటయ్యాడు. కానీ ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం రోహిత్ ఫుల్ షాట్‌లు ఆడకుండా తనని తాను నియంత్రించుకున్నాడు. అయినప్పటికీ షార్ట్ పిచ్, బౌన్సర్లతో శర్మని ఇంగ్లండ్ పేసర్లు పరీక్షించారు. ఈ క్రమంలో ఓలీ రాబిన్సన్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని రోహిత్ ర్యాంప్ షాట్ ఆడేశాడు. బంతి బౌన్స్ అవగా రోహిత్ కూడా బౌన్స్‌కి అనుగుణంగా కొద్దిగా జంప్ చేస్తూ ఆ షాట్ ఆడాడు. షార్ట్ పిచ్ బంతికి రోహిత్ ఫుల్ షాట్ ఆడతాడని ఊహించిన రాబిన్సన్.. లాంగ్ లెగ్‌లో ఓ ఫీల్డర్‌ని కూడా ఉంచాడు. కానీ ఎత్తుగడలు ఏం పనిచేయలేదు. బంతి సిక్స్‌గా వెళ్లడంతో నోరెళ్లబెట్టడం రాబిన్సన్ వంతైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications