Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో: చివరి ఓవర్‌లో హైడ్రామా - వికెట్‌ను త్యాగం చేసిన రిషభ్ పంత్..!!

IND vs ENG: Rishabh Pant sacrifices his wicket for Hardik Pandya, Twitter lauds

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ ఆడుతోంది. ప్రత్యర్థికి పోరాడదగ్గ స్కోర్‌ను లక్ష్యంగా నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. ఆరు ఓవర్లల్లో వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 19 బంతుల్లో ఆరు ఫోర్లతో 28, అలెక్స్ హేల్స్ 20 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులు చేశారు.

టీమిండియా బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేదీ మ్యాచ్‌లో. ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ విఫలం అయ్యాడు. ఇన్నింగ్ తొలిబంతిని బౌండరీ దాటించిన కేఎల్ రాహుల్.. గేర్ మార్చాడనుకునేలోపే అవుట్ అయ్యాడు. అయిదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ ఫర్ల్వాలేదనిపించుకున్నాడు గానీ.. కేప్టెన్సీ ఇన్నింగ్ మాత్రం కాదు. 28 బంతుల్లో నాలుగు ఫోర్లతో 27 పరుగులు చేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా చేతులెత్తేశాడు. 10 బంతుల్లో 14 పరుగులు చేశాడంతే. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. మ్యాచ్‌ను బతికించారు. ఇన్నింగ్‌కు జీవం పోశారు.

విరాట్ కోహ్లీ 40 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో సరిగ్గా అర్ధసెంచరీ చేశాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అవుట్ అ్యాడు. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్ హైలైట్‌గా నిలిచిందీ మ్యాచ్‌లో. 33 బంతుల్లో 63 పరుగులు బాది అవతలపడేశాడు. అతని ఇన్నింగ్‌లో అయిదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇన్నింగ్ చిట్టచివరి బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 20వ ఓవర్ చివరిబంతిని స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి పంపించాడు గానీ.. ఈ ప్రాసెస్‌లో హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు.

అంతకుముందు- ఇదే చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్ రెండో బంతిని వైడ్ యార్కర్‌గా క్రిస్ జోర్డాన్ సంధించిన బంతిని ఆడబోయాడు రిషభ్ పంత్. అది అతని బ్యాట్‌ను తాకిన వికెట్ కీపర్ జోస్ బట్లర్ అందుకున్నాడు. ఆలోగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా సగం పిచ్ దాటి వచ్చేశాడు. అతను రావడాన్ని గమనించిన బట్లర్- బంతిని వేగంగా విసరగా అది స్టంప్స్‌కు తగల్లేదు. అప్పటికే హార్దిక్ పాండ్యా కీపర్ ఎండ్ వైపు వచ్చేయడంతో- నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరుగెత్తాడు.

ఆ లోపే బౌలర్ క్రిస్ జోర్డాన్ బంతిని అందుకుని వికెట్లను గిరాటేశాడు. రిషభ్ పంత్ త్యాగాన్ని వృధా కానివ్వలేదు హార్దిక్ పాండ్యా. ఆ తరువాత ఎదుర్కొన్న రెండు బంతుల్లో 10 పరుగులు పిండుకున్నాడు. నాలుగో బంతిని సిక్స్, అయిదు బంతిని ఫోర్‌గా వాటిని మలిచాడు. చివరి బంతికి తానూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Thursday, November 10, 2022, 16:14 [IST]
Other articles published on Nov 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+