Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్

వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అశ్విన్ రికార్డుల కెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉండేది. అతడు ఇంగ్లండ్‌పై 95 వికెట్లు పడగొట్టాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు సాధించిన టీమిండియా బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (97 వికెట్లు) తర్వాత వరుసగా చంద్రశేఖర్ (95), అనిల్ కుంబ్లే (92), బిషన్ సింగ్ బేడీ (85), కపిల్ దేవ్ (85), ఇషాంత్ శర్మ (67) ఉన్నారు. ప్రస్తుత భారత బౌలర్లు ఎవరూ అశ్విన్‌కు దగ్గరలో లేరు.

IND vs ENG: R Ashwin creates record Most wickets for India vs England in Tests

కాగా, రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 67/1తో సోమవారం ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో భారత్ బౌలర్లు చెలరేగి అయిదు వికెట్లు పడగొట్టడం విశేషం. అశ్విన్ తన అనుభవాన్ని ఉపయోగించి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. గత టెస్టు హీరో ఒలీ పోప్ (23; 21 బంతుల్లో), దిగ్గజ ప్లేయర్ జో రూట్ (16; 10 బంతుల్లో)ను అశ్విన్ బోల్తాకొట్టించాడు.

అయితే సోమవారం ఆటలో వికెట్ల వేట ప్రారంభించింది అక్షర్ పటేల్. నైట్ వాచమన్ రెహాన్ అహ్మద్ (23; 31 బంతుల్లో)‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. కానీ జానీ బెయిర్‌స్టో (26; 36 బంతుల్లో)‌తో కలిసి ఓపెనర్ జాక్ క్రాలే (73; 132 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. 194/4తో మెరుగైన స్థితితో లంచ్ బ్రేక్‌కు దగ్గరగా వచ్చారు.

ఆ తర్వాత టీమిండియా పుంజుకుని వరుస ఓవర్లలో వికెట్లు సాధించింది. క్రాలేను కుల్‌దీప్ యాదవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే అంపైర్ తొలుత ఔట్ ఇవ్వలేదు. రివ్యూకి వెళ్లి భారత్ వికెట్ సాధించుకుంది. అనంతరం బెయిర్ స్టోను బుమ్రా ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్ ఉన్నాడు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 205 పరుగులు చేయాలి.

Story first published: Monday, February 5, 2024, 11:54 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+