For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: కాస్త బుర్ర పెట్టండి.. భారత్‌ను ఓడించాలంటే అదే మార్గం!

అయిదు టెస్టుల సిరీస్‌లో మరో సమరానికి భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. రాంచీ వేదికగా రేపటి నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన టీమిండియానే రాంచీ టెస్టులోనూ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కీలక సూచనలు చేశాడు.

భారత్‌లోని పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలని, కాస్త బుర్రతో ఆలోచించాలని నాజర్ హుస్సేన్ అన్నాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఇంగ్లండ్ తొలుత 0-2తో వెనుకబడి కూడా సిరీస్‌ను 2-2తో సమం చేసిందని గుర్తుచేశాడు. ఆ సమయంలో తెలివిగా ఆడి మిగిలిన మూడు టెస్టుల్లో రెండింట్లో విజయం సాధించిందని తెలిపాడు.

IND vs ENG: play smart cricket, not headless cricket against India- Nasser Hussain

'' ఈ తరహాలోనే ఆడతామని జపించకండి. టెస్టు క్రికెట్ అనేది పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సిన ఫార్మాట్. ముఖ్యంగా భారత్‌లో సందర్భాన్ని బట్టి ఆడాలి. అయిదు రోజుల ఆటలో అక్కడ రాత్రికే రాత్రి పిచ్ మారే వాతావరణాన్ని కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటేనే పైచేయి సాధించగలరు''

''ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టులను ఒక్కసారి పరిశీలించండి. ఒలీ పోప్ 196 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించిది. ఆ తర్వాత యశస్వీ జైస్వాల్ వరుస డబుల్ సెంచరీలు, రోహిత్ శర్మ 131 పరుగులతో రెండు, మూడు టెస్టుల్లో టీమిండియా గెలిచింది''

''గతంలో ఇంగ్లండ్ ఇలాంటి పరిస్థితుల్లోనే గొప్పగా పుంజుకుంది. యాషెస్ సిరీస్ సమయంలో ఎలా ఆలోచించారో గుర్తు చేసుకోండి. షార్ట్ బాల్స్‌కు బెంబేలెత్తి లార్డ్స్‌లో ఇంగ్లండ్ కుప్పకూలింది. కానీ ఆ తర్వాత అద్భుతంగా రాణించింది. ఇక బజ్‌బాల్ అని ఎప్పుడూ చెబుతుంటారు. బుర్ర లేకుండా ఆడకండి. స్మార్ట్ క్రికెట్ ఆడండి. సత్తాచాటగలమని నిరూపించండి'' అని ఇంగ్లండ్ జట్టుకు నాజర్ హుస్సేన్ కీలక సూచనలు చేశాడు.

క్రీజులో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించాలని జానీ బెయిర్‌స్టో‌కు నాజర్ హుస్సేన్ సూచించాడు. అతడు కుదురుకుంటే విధ్వంసకర బ్యాటర్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. కాగా, తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ తర్వాత రెండు టెస్టుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ రికార్డు విజయాన్ని నమోదుచేసింది.

ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, ఒలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్ , షోయబ్ బషీర్

Story first published: Thursday, February 22, 2024, 13:28 [IST]
Other articles published on Feb 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+