For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: 69 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన టీమిండియా ఓపెనర్లు!!

Ind vs Eng: Openers Rohit Sharma and KL Rahul break 69 years old record for Team India
Rohit Sharma - KL Rahul Break 69 Year Old Record | Vinoo Mankad - Pankaj Roy || Oneindia Telugu

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్-రాహుల్ జోడి 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో 69 ఏళ్ల తర్వాత లార్డ్స్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌లో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన టీమిండియా ఓపెనింగ్‌ జోడిగా నిలిచింది. పిచ్ పేస్ బౌలర్లకు సహకరిస్తున్నా.. భారత బౌలర్లు అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలోనే రోహిత్‌-రాహుల్‌లు 126 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

1952లో క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారిగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వినోద్‌-పంకజ్‌లు 106 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 69 ఏళ్ల పాటు వారిపై ఉన్న ఆ రికార్డు తాజాగా బ్రేక్ అయింది. రెండో టెస్ట్ రెండో సెషన్లో రోహిత్‌ శర్మ-కేఎల్ రాహుల్‌ల జోడి వారిని అధిగమించారు. రోహిత్‌-రాహుల్‌లు 126 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ రికార్డు బ్రేక్ అయింది. చివరకు జేమ్స్ ఆండర్సన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ (83; 145 బంతుల్లో 11x4, 1x6) బౌల్డయ్యాడు.

లార్డ్స్ మైదానంలో భారత ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శ‌ర్మలు మరో అరుదైన రికార్డు కూడా నెలకొల్పారు. తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం అందించిన మొదటి జోడిగా నిలిచారు. 2008లో ఇంగ్లండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్.. దక్షిణాఫ్రికాపై నెలకొల్పిన 114 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. 13 సంవత్సరాలుగా మరే జోడి కూడా 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పలేకపోయింది. రెండో టెస్టు మ్యాచ్‌లో మతం భారత జోడి ఏకంగా 126 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ జెఫ్రీ బాయ్‌కాట్ లార్డ్స్ స్టాండ్స్‌లో పక్కపక్కనే కూర్చున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీరిద్దరి ఫొటోలను ట్వీట్ చేసిన ఓ అభిమాని.. 'గంగూలీ, అతడి అతిపెద్ద అభిమాని సర్ జెఫ్రీ బాయ్‌కాట్ మరోమారు కలిశారు' అని క్యాప్షన్ పెట్టాడు. గంగూలీకి 'ప్రిన్స్ ఆఫ్ కలకత్తా' అనే నిక్‌‌నేమ్ పెట్టింది బాయ్‌కాటే. గంగూలీతో పాటు అతడి భార్య డోనా, బీసీసీఐ కార్యదర్శి జే షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్టాండ్స్‌లో సందడి చేశారు.

Story first published: Thursday, August 12, 2021, 23:02 [IST]
Other articles published on Aug 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+