For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: నాలుగో రోజు చేతులెత్తేసిన బ్యాట్స్‌మన్‌.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి!!

India vs England 3rd Test: Ollie Robinson shine as England win by an innings and 76 runs.

లీడ్స్‌: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో భారత్ ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన భారత్.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 212/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ ఏ దశలోనూ కనీస పోరాటం చేయలేదు. మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓలి రాబిన్‌సన్‌ నిప్పులు చెరిగే బంతులు వేయడంతో భారత్ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఆదిలోనే పుజారా ఔట్:

ఆదిలోనే పుజారా ఔట్:

212/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. తొలి సెషన్‌లోనే మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల్లోనే టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా (91: 189 బంతుల్లో 15x4) ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మరి రివ్యూ తీసుకుని టీమిండియాను కోలుకొని దెబ్బకొట్టాడు. కాసేపటికే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (55; 125 బంతుల్లో 8x4) అర్ధ శతకం సాధించినా.. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లోనే స్లిప్‌లో కెప్టెన్ రూట్‌ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 237/4గా నమోదై కష్టాల్లో పడింది.

వరుసగా పెవిలియన్‌కు:

వరుసగా పెవిలియన్‌కు:

పుజారా, కోహ్లీ ఔట్ అనంతరం భారత్ వికెట్ల పతనం మొదలైంది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. ప్రతిఒక్కరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (10), వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ (1), పేసర్ మొహ్మద్ షమీ (6), ఇషాంత్ శర్మ (2), రవీంద్ర జడేజా (30), మొహమ్మద్ సిరాజ్‌(0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్‌గా నిలిచాడు. చివరికి భారత్‌ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలి రాబిన్‌సన్‌ ఐదు వికెట్లు తీయగా..క్రెయిగ్ ఓవర్టన్‌ మూడు తీశాడు. జేమ్స్ అండర్సన్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ సాధించారు.

రోహిత్‌, పుజారా శ్రమ వృధా:

రోహిత్‌, పుజారా శ్రమ వృధా:

అంతకుముందు మూడో రోజు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, చేతేశ్వర్ పుజారా అర్ధ శతకాలతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దాంతో భారత్‌ మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి 212/2 స్కోర్‌తో నిలిచి మ్యాచ్‌లో పోరాటం చేసేలా కనిపించింది. ఈ క్రమంలోనే నాలుగో రోజు కూడా ఇలాగే ఆడితే మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుందని అంతా ఆశించారు. కానీ భారత బ్యాట్స్‌మెన్‌ నాలుగో రోజు పూర్తిగా చేతులెత్తేశారు. ఒక్కరు కూడా క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి కోహ్లీసేనను కట్టడి చేశారు.

సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్:

సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్:

భారత్ గెలవాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కాగా.. లార్డ్స్‌లో జ‌రిగిన‌ రెండో టెస్ట్‌లో కోహ్లీసేన విజ‌యం సాధించింది. దాంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇక లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ సిరీసును 1-1తో సమం చేసింది. మ‌రో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జ‌రుగాల్సి ఉంది. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్ట్ జరగనుంది.

స్కోరు బోర్డు:

స్కోరు బోర్డు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78 ఆలౌట్‌.. రోహిత్‌(19), అండర్సన్‌ 3 వికెట్లు

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 432 ఆలౌట్‌.. జో రూట్‌(121), షమి 4 వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 278 ఆలౌట్‌.. పుజారా (91), రాబిన్‌సన్‌ 5 వికెట్లు

Story first published: Saturday, August 28, 2021, 18:05 [IST]
Other articles published on Aug 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+