Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జవాన్ తో అలా ప్రవర్తించిన కోహ్లీ! - క్షమాపణలు చెప్పాలని డిమాండ్!!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ CISF జవాన్ తో విరాట్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కోహ్లీ క్షణాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌లో నిరాశపరిచిన కోహ్లీ.. టోర్నీ ముగిశాక తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ సరదాగా గడిపాడు. తాను అమితంగా ఇష్టపడే వృందావన్‌ను కూడా సందర్శించాడు. భార్య అనుష్క శర్మ తో కలిసి ముంబయి వీధుల్లో విహరించాడు. బోడ్ రైడ్ కూడా చేశాడు. ఈ క్రమంలో ముంబయి తాజ్ హోటల్ ముందు కారు దిగి నడుచుకుంటు కూడా వెళ్లాడు.

IND VS ENG Netizens Demands Virat Kohli to says apologizes for Rude Behaviour With CISF Jawan Video goes viral

అయితే తన భార్యతో కలిసి కోహ్లీ నగర వీధుల్లో షికార్లు కొడుతున్నప్పుడు.. అక్కడున్న వాళ్లంతా ఆకస్మికంగా విరాట్ ను సర్ ప్రైజ్ అయిపోయారు. అతడిని చుట్టు ముట్టేసి.. తనతో కలిసి ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. అలానే క్లిక్ మంటూ విరాట్ ను తమ కెమెరాల్లో బంధించారు.

ఈ క్రమంలో ఓ CISF జవాన్ కూడా అందరిలాగే తన అభిమాన ప్లేయర్ తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ జవాన్ ఫోన్ తీయగానే విరాట్ వద్దని చెబుతూ ముందుకెళ్లిపోయాడు. దీంతో ఆ జవాన్ నిరాశగానే వెనుదిరిగాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు.. కోహ్లీ జవాన్ కు గౌరవం ఇవ్వలేదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరి కొంతమంది విరాట్ కు మద్దతుగా నిలుస్తున్నారు. వాస్తవానికి జనం ఎక్కువగా ఉండటం వల్ల, అక్కడ విరాట్ సైలెంట్ గా ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండానే వెళ్లిపోయాడు.

ఇకపోతే రీసెంట్ గా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో.. ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ, మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ సిరీస్‌ అనంతరం ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడనున్నాడు.

Story first published: Wednesday, January 22, 2025, 10:34 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+