విరాట్ కోహ్లీది పిచ్చిపనే.. 413 వికెట్లు, 5 సెంచరీలు చేసిన ఆటగాడిని తీసుకోడా?! గొప్ప నాన్ సెలక్షన్ ఎంపిక ఇదే!!

లండన్: టీమిండియా అభిమానులకు భారీ షాకిచ్చాడు భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీసులో వరుసగా నాలుగో మ్యాచులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటివ్వలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకే ఇష్టపడుతున్న కోహ్లీ.. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ కూర్పునే కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో పిచ్‌లు పేసర్లకు సహకరించాయి. ఐతే మూడో టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలవ్వడంతో నాలుగో టెస్టులో అశ్విన్‌ను తీసుకోవాలని విశ్లేషకులు సూచించారు. భారత మాజీలతో సహా క్రికెట్ దిగ్గజాలు, కామెంటేటర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

యాష్ కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు

యాష్ కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు

ప్రస్తుతం జరుగుతున్న ఓవల్‌ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని రికార్డులు చెబుతున్నాయి. ఓవల్‌ పిచ్‌ పేస్‌కు అంతగా అనుకూలించదని అంటారు. దేశవాళీ క్రికెట్లో సర్రే జట్టు అక్కడ ఐదు మ్యాచులు ఆడగా మూడింట్లో ఎవరినీ విజయం వరించలేదు. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇక్కడ కౌంటీ క్రికెట్ ఆడాడు.

సర్రే, సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. అదీకాకుండా పిచ్‌ అనుకూలత, ఇంగ్లండ్ జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం, వైవిధ్యమైన బంతులు వేయగల అనుభవం ఉండటంతో అశ్విన్‌కు చోటు దొరుకుతుందని చాలామంది అంచనా వేశారు.

అశ్విన్ లేకుండానే

కానీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో కూడిన భారత జట్టు యాజమాన్యం మాత్రం ఆఖర్లో షాకిచ్చారు. రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే నాలుగో టెస్టులో భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. టాస్ సమయంలో విరాట్ మాట్లాడుతూ జట్టు ఎంపికపై మాట్లాడాడు. అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలనే భావించామని అయితే ఇంగ్లండ్ నలుగురు లెఫ్ట్ హ్యాండర్లతో బరిలోకి దిగుతోందని కాబట్టి, రవీంద్ర జడేజాకు ఇది మంచి మ్యాచ్ అవుతుందని కోహ్లీ అన్నాడు.

ఘోర తప్పిదం

ఘోర తప్పిదం

రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ మైఖేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భారత్ నిర్ణయాన్ని పిచ్చిపనిగా అభివర్ణించాడు. 'నాలుగు టెస్ట్‌లలో మనం చూసిన గొప్ప నాన్ సెలక్షన్ ఎంపిక ఇదే. అశ్విన్‌ను పక్కనపెట్టడం ఏంటి. 413 టెస్టు వికెట్లు, 5 టెస్టు సెంచరీలు చేసిన అశ్విన్ లాంటి ఆటగాడిని పక్కనపెట్టడం ఘోర తప్పిదం' అని వాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట అయింది.

అశ్విన్ తుది జట్టులో లేకపోవడంపై భారత కామెంటేటర్లు హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అశ్విన్ ఎంపిక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని మంజ్రేకర్ పేర్కొనగా.. యాష్ నెట్స్‌లో తెల్లటి బంతితో బౌలింగ్ చేస్తే ఆశ్చర్యపోతా అని భోగ్లే ట్వీట్ చేశాడు.

US Open 2021: మూడో రౌండ్లో బార్టీ, జకోవిచ్.. మరోసారి వివాదాస్పదమైన సిట్సిపాస్‌ టాయ్‌లెట్‌ బ్రేక్‌!!

మండిపడుతున్న ఫాన్స్

మండిపడుతున్న ఫాన్స్

మరోవైపు నాలుగు టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు ఇవ్వకపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత ఫాన్స్ మండిపడుతున్నారు. ఒకవైపు ట్వీట్ల వర్షం కురిపిస్తూ.. మరోవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'ఎప్పటికైనా ఇది చెత్త ఎంపిక. విరాట్ కోహ్లీకి అంత అహం ఎందుకు.. ఆర్ అశ్విన్‌నే ఆడించడా?' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'అశ్విన్ లేడుగా.. ఈ మ్యాచ్ కూడా పోయినట్టే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

'యాష్ వికెట్లు తీయడంలో ఎంత మంచి బౌలరో భారత జట్టు గుర్తించట్లేదు', 'నాలుగో టెస్ట్ కోసం అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదు', 'భారత జట్టులో అశ్విన్ లేడా?', 'యాష్ లేడా.. జట్టు ఎంపికపై ఆశ్చర్యం వేస్తోంది' అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అశ్విన్ ఈ సిరీసులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.

బ్యాటింగ్‌లో తడబడ్డా

బ్యాటింగ్‌లో తడబడ్డా

నాలుగో టెస్టు మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది. బ్యాటింగ్‌లో తడబడ్డా.. మొదటి రోజు ఆఖరుకు భారత్ పోటీలో నిలిచింది. మరోసారి తక్కువ పరుగులకే ఆలౌట్ అవ్వనున్న సమయంలో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (57; 36 బంతుల్లో 7×4, 3×6) విరుచుకుపడడంతో మొదట భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది.

కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (50; 96 బంతుల్లో 8×4) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లు క్రిస్ వోక్స్‌ (4/55), ఓలి రాబిన్సన్‌ (3/38) రాణించారు. అయితే ఆట చివరలో బంతితో భారత్‌ విజృంభించింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మలన్‌ (26 బ్యాటింగ్‌)తో పాటు క్రెయిగ్ ఓవర్టన్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ (21)ను ఉమేశ్‌ యాదవ్ ఔట్‌ చేసి భారత్‌కు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చాడు.

ఇక విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగులు ఈ మ్యాచ్ ద్వారా పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును విరాట్ తిరగరాశాడు. సచిన్‌ 522 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకోగా.. కోహ్లీ 490 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 3, 2021, 8:44 [IST]
Other articles published on Sep 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X