Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రోహిత్ ఆన్సర్‌కు బిత్తరపోయిన మీడియా!

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. బాజ్‌బాల్ క్రికెట్, కోహ్లి గైర్హాజరు, టెస్టుల ప్రాముఖ్యత, ఇంగ్లాండ్ ప్లేయర్ షోయబ్ బషీర్ వీసా సమస్య వంటి మొదలైన విషయాల గురించి రోహిత్ మాట్లాడాడు.

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో రజత్ పటిదార్ ఎంపికయ్యాడని వార్తలు వస్తున్నాయి. అయితే కోహ్లి లేని లోటు జట్టులో ఉంటుందని రోహిత్ తెలిపాడు. '' కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడానికి అనుభవం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయాలని భావించాం. కానీ యువ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాం. యువ ఆటగాళ్లకు విదేశాల్లో నేరుగా అవకాశాలు ఇవ్వకుండా ఇక్కడ ఇస్తే బాగుంటుదని ఆలోచించాం'' అని రోహిత్ అన్నాడు.

IND vs ENG: Media freaked out by Rohit Sharmas answer

బాజ్‌బాల్ గురించి మాట్లాడుతూ.. దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదని హిట్‌మ్యాన్ చెప్పాడు. ''మా ఆట మేం ఆడతాం. జట్టుగా మేం ఏం చేయాలో దానిపైనే దృష్టిసారిస్తాం' అని పేర్కొన్నాడు. టెస్టు ఫార్మాట్ ఎంతో గొప్పదని, ఆటగాళ్లుగా అసలైన సవాళ్లను టెస్టుల్లోనే ఎదుర్కొంటామని రోహిత్ అన్నాడు. టెస్టు గురించి మాట్లాడటం, ఆడటం, ముందు తరాలకు ఈ ఫార్మాట్ ప్రాముఖ్యత తెలియజేయడం మన విధి అని తెలిపాడు.

కాగా, వీసా కారణంగా ఇంగ్లాండ్ యువ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. వీసా సమస్యతో అతడు ఇప్పటికీ భారత్‌లో అడుగుపెట్టలేకపోయాడు. అబుదాబి నుంచి ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీని గురించి స్పందించమని మీడియా ప్రతినిధులు రోహిత్‌ను అడగ్గా.. అతడు వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. దురదృష్టవశాత్తు వీసా ఆఫీస్‌లో తాను లేనని, ఉండి ఉంటే కచ్చితంగా అతడికి అనుమతి ఇచ్చేవాడినని సటైరిక్‌గా బదులిచ్చాడు.

''షోయబ్ బషీర్ విషయంలో బాధ పడుతున్నా. అయితే దురదృష్టవశాత్తు నేను వీసా ఆఫీస్‌లో ఉండలేకపోయా. ఒకవేళ ఉంటే మీకు దీని గురించి మరింత సమాధానమిచ్చేవాడిని (నవ్వుతూ). ఏమైనప్పటికీ అతడికి వీసా సమస్య త్వరలోనే తొలిగిపోతుందని ఆశిస్తున్నా. మా దేశంలో పర్యటించి ఎంజాయ్ చేస్తాడని భావిస్తున్నా'' అని రోహిత్ అన్నాడు.

మరోవైపు తొలి టెస్టుకు తుది జట్టును ఇంగ్లాండ్ ఈ రోజే ప్రకటించింది. ముగ్గురు స్పిన్నర్లు, ఒకే ఒక్క పేసర్‌తో బరిలోకి దిగుతుంది.

ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ , రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ (దూరం), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్

Story first published: Wednesday, January 24, 2024, 15:39 [IST]
Other articles published on Jan 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+