For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌ను వెన్నాడిన వర్షం, ఇంగ్లాండుతో మ్యాచ్ టై

By Pratap
Suresh Raina
లార్డ్స్: భారత క్రికెట్ జట్టును ఇంగ్లాండుతో జరిగిన నాలుగో వన్డేలో వర్షం రూపంలో దురదృష్టం వెన్నాడింది. వర్షం కారణంగా ఆట ఆగిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం వన్డే మ్యాచు టై అయింది. ఇంగ్లాండు వరుసగా స్వాన్ (31), రవి బొపారా (96) వికెట్లు కోల్పోవడంతో దాదాపుగా మ్యాచ్ భారత్‌కు అనుకూలంగా మారింది. మరో ఏడు బంతుల్లో ఇంగ్లాండు 11 పరుగులు చేయాల్సిన సమయంలో వర్షం పడి ఆట నిలిచిపోయింది. అప్పటికి ఇంగ్లాండు 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది.

ఇంగ్లాండు 45 ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసిన సమయంలో కూడా వర్షం కారణంగా ఓసారి ఆట నిలిచిపోయింది. అప్పటికి 281 పరుగులు చేసి విజయాన్ని అందుకోవాల్సి ఉండగా, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం రెండు పరుగులతో ఇంగ్లాండు గెలిచే పరిస్థితి ఉండింది. అయితే, వర్షం నిలిచిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది. ఆ తర్వాత మునాఫ్ పటేల్ దంచి కొడుతున్న స్వాన్‌ను రన్నవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి మునాఫ్ పటేల్ బంతికి బొపారా జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పుడు వర్షం పడి మళ్లీ ఆట మొదలయ్యే పరిస్థితి లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ టై అయినట్లుగా ప్రకటించారు. ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ బెల్, బొపారా అద్భుతంగా ఆడి ఇంగ్లాండును ఆదుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రారంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా సురేష్ రైనా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టారు. రైనా 84 పరుగులు చేయగా, ధోనీ 78 పరుగులు చేసిన నాటవుట్‌గా మిగిలాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. ధోనీ 71 బంతులు ఎదుర్కొని మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లు బాదాడు. రైనా స్కోరులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. భారత్ 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసిన స్థితిలో రైనా, ధోనీ భారీ స్కోరు సాధించారు. మొత్తం మీద వన్డే సిరీస్ కూడా భారత్ చేజారిపోయింది. ఐదు వన్డేల సిరీస్ ఇంగ్లాండు వశమైంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+