For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: మాంచెస్టర్ టెస్ట్ హ్యాండ్‌షేక్ వివాదం.. అసలు నిజం ఇదే! (వీడియో)

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ చివరి దశలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ విషయంలో కొంత వివాదం తలెత్తింది. మ్యాచ్ డ్రా అని దాదాపు ఖరారు కాగా.. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తన తొలి టెస్ట్ సెంచరీలకు చేరువలో ఉన్నారు. ఆ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాచ్‌ను ముగించి.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో చేతులు కలపాలని కోరుకున్నాడు. అయితే భారత ఆటగాళ్లు అందుకు నిరాకరించినట్లు తొలుత వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ సంఘటనతో ఇంగ్లండ్ ఆటగాళ్లు కొంత అసంతృప్తితో కనిపించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన అనంతరం బెన్ స్టోక్స్.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో హ్యాండ్‌షేక్ చేయలేదని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో ఆధారంగా బెన్ స్టోక్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

IND vs ENG Manchester Test Handshake Controversy Full Truth Revealed

మైఖేల్ వాన్ షేర్ చేసిన కొత్త వీడియోతో బయటపడిన నిజం
అయితే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతూ .. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత మైఖేల్ వాన్ తన సోషల్ మీడియా ఖాతాలో మ్యాచ్ తర్వాత తీసిన ఒక కొత్త వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో బెన్ స్టోక్స్.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో చేతులు కలుపుతూ స్పష్టంగా కనిపించాడు. బెన్ స్టోక్స్ చాలా తొందరగా హ్యాండ్‌షేక్ చేసి ముందుకు వెళ్లిపోవడంతో కొందరు కరచాలనం చేయలేదని తప్పుగా భావించి ఆ అపోహతోనే కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారని మైఖేల్ వాన్ ఈ వీడియో ద్వారా వివరించారు.

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) కూడా బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో చేతులు కలుపుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ వివాదంపై స్పష్టతనిచ్చింది. అంతే కాకుండా మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బెన్ స్టోక్స్ స్వయంగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరి అద్భుతమైన ఆటతీరును ప్రశంసించాడు.ఇది ఆట పట్ల బెన్ స్టోక్స్ క్రీడాస్ఫూర్తిని తెలియజేస్తుంది.

ఓవల్‌లో చివరి టెస్ట్ మ్యాచ్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ జులై 31న లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్‌ను గెలిచి టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేయాలని శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.

Story first published: Tuesday, July 29, 2025, 15:11 [IST]
Other articles published on Jul 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+