Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: తెలుగోడి పరువు తీస్తున్నావ్ భరత్ అన్న!

టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ మరోసారి విఫలమయ్యాడు. తన పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న వైజాగ్ టెస్టులోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటైన భరత్.. రెండో ఇన్నింగ్స్‌లో 28 బంతులు ఎదుర్కొని ఆరు పరుగులకే వెనుదిరిగాడు.

ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడిన భరత్ అత్యధిక స్కోరు 44 మాత్రమే. 12 ఇన్నింగ్స్‌ల్లో 20 సగటుతో 221 పరుగులే చేశాడు. వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నాడు. ఇప్పటికే టీమిండియాలో చోటు కోసం వికెట్ కీపర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కేఎల్ రాహుల్, సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, ఇషాన్ కిషాన్ టెస్టుల్లో గ్లవ్స్ బాధ్యతలు అందుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లతో పాటు రిషభ్ పంత్ కూడా రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు.

Ind vs Eng: KS Bharat getting trolls after scoring less runs in Vizag test

ఇలాంటి పరిస్థితుల్లో భరత్ వచ్చే అవకాశాలను మిస్ చేసుకుంటూ తన కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడు. మరోవైపు వికెట్ కీపర్‌గానూ భరత్ సత్తాచాటలేకపోతున్నాడు. రాహుల్‌ను కాదని స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా స్పిన్ పిచ్‌లపై అవకాశం దక్కించుకున్న అతడు నిరాశపరుస్తున్నాడు. వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒలీ పోప్‌ను తొలి బంతికే ఔట్ చేసే ఓ సువర్ణావకాశాన్ని భరత్ నేలపాలు చేశాడు. స్టంపౌట్ చేసే అవకాశాన్ని కేఎస్ భరత్ చేజార్చాడు.

ఈ నేపథ్యంలో భరత్‌పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. 'భరత్ ఏపీకి చెందిన వికెట్ కీపర్. అతడికి మొదట అవకాశాలు ఇచ్చింది తెలుగోడు అయిన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. '3-డీ'లా విజయ్ శంకర్‌ను తీసుకువచ్చినట్లు '3-సీ'గా భరత్ వచ్చాడు. సీ అంటే చేయలేను.. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, డీఆర్ఎస్ సరిగా చేయలేను', 'సంజు శాంసన్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలి', 'భరత్ కంటే ఓ బౌలర్ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు' అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు ఈ పోస్టులపై తెలుగు క్రికెట్ అభిమానులు స్పందిస్తూ.. 'తెలుగోడి పరువు తీస్తున్నావు భరత్ అన్న.. వచ్చే మ్యాచ్‌లో సెంచరీ సాధించాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భరత్ 41, 28 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా, భరత్ క్రీజులో ఉన్నంతసేపు మొదటి టెస్టులో టీమిండియా విజయంపై అభిమానులు ధీమాగానే ఉన్నారు. కానీ భరత్ ఔటైనా తర్వాత మిగిలిన బ్యాటర్లు వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు.

Story first published: Sunday, February 4, 2024, 15:40 [IST]
Other articles published on Feb 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+