For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు!

IND vs ENG: భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ అర్థ శతకంతో కేఎల్ రాహుల్ పాకిస్థాన్‌కు చెందిన సయీద్ అన్వర్, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లను ఒకే దెబ్బతో అధిగమించాడు. ఆసియా ఓపెనర్లుగా సేన(SENA) దేశాలలో 10కి పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్‌ తర్వాత సేన దేశాలలో అత్యధిక అర్థ శతకాలు బాదిన ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. SENA దేశాలు అంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.

కేఎల్ రాహుల్ కు ఇది టెస్ట్ క్రికెట్‌లో 19వ అర్థ సెంచరీ కాగా.. SENA దేశాలలో అతని 11వ 50 ప్లస్ స్కోర్. సేన దేశాలలో ఆసియా ఓపెనర్‌గా అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో సునీల్ గవాస్క‌ర్ అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంకకు చెందిన దిముత్ కరుణరత్నే రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ సయీద్ అన్వర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు.

IND vs ENG KL Rahul Surpasses Sehwag Saed Anwar with New SENA Record

ఆసియా ఓపెనర్లలో సేన దేశాలలో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..

19 - సునీల్ గవాస్కర్

12 - దిముత్ కరుణరత్నే

11 - కేఎల్ రాహుల్*

10 - వీరేంద్ర సెహ్వాగ్

10 - సయీద్ అన్వర్

10 - తమీమ్ ఇక్బాల్

కేఎల్ రాహుుల్ నుంచి లార్డ్స్ టెస్ట్ మూడో రోజు భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. భారత్ రెండో రోజు చివరికి ఇంగ్లండ్ 387 పరుగుల లక్ష్యానికి సమాధానంగా 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టుకు ఇప్పటికీ 242 పరుగుల ఆధిక్యం ఉంది. కేఎల్ రాహుల్ లార్డ్స్‌లో సెంచరీ సాధించగలిగితే ఖచ్చితంగా మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించగలడు.

Story first published: Saturday, July 12, 2025, 13:27 [IST]
Other articles published on Jul 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+