Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ ఇదే!

IND vs ENG: స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025లో అంతగా రాణించకపోయినా, టెస్ట్ క్రికెట్ తన అసలు ఆట అని మరోసారి నిరూపించాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన హెడింగ్‌లీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు. జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన రెండవ వికెట్ కీపర్‌గా పంత్ నిలవడంతో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అతనికి అభినందనలు తెలిపారు.

రిషభ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్
హెడింగ్లీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడాడు. కానీ రెండో సెషన్ ప్రారంభం కాగానే రిషబ్ పంత్ వేగంగా పరుగులు చేయడం ప్రారంభించాడు. రిషబ్ పంత్ బ్రైడన్ కార్స్,బెన్ స్టోక్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్‌ల బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టాడు. షోయబ్ బషీర్‌ బౌలింగ్‌లో సింగిల్ తీసి రిషబ్ పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనికి ముందు రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేశాడు.

IND vs ENG KL Rahul Rishabh Pant Centuries Impress Sanjiv Goenka

గోయెంకా ట్వీట్ ఇలా..
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. "చాలా బాగుంది! రిషబ్ పంత్ వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దూకుడుగా, సాహసోపేతంగా, అద్భుతంగా. చరిత్రలో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్ మాత్రమే." అంటూ సంజీవ్ గోయెంకా ట్వీట్ చేశారు.

సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌కు తన తొమ్మిదో టెస్ట్ సెంచరీకి కూడా అభినందనలు తెలిపారు. కుడిచేతి వాటం బ్యాటర్ కేఎల్ రాహుల్ 247 బంతుల్లో 137 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ వల్ల భారత్ ఇంగ్లండ్ కు 370కి పైగా పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నాలుగో వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్ గురించి ఇలా రాసుకొచ్చారు. "కేఎల్ రాహుల్‌కు అతని సెంచరీకి కూడా అభినందనలు." అంటూ పేర్కొన్నారు.

లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జట్టు అతన్ని రిలీజ్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఒక మ్యాచ్ సమయంలో, జట్టు పది వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత సంజీవ్ గోయెంకా రాహుల్‌ను బహిరంగంగా మందలించడం కనిపించింది. హెడింగ్‌లీ టెస్ట్‌లో ఉత్కంఠభరితమైన ఐదవ రోజు మిగిలి ఉంది. ఇంగ్లండ్ గెలవడానికి ఇంకా 350 పరుగులు చేయాల్సి ఉంది.

Story first published: Tuesday, June 24, 2025, 12:02 [IST]
Other articles published on Jun 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+