స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంత సులువు కాదని తెలుసుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు నోటికి పనిచెబుతున్నారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత ప్లేయర్లను కవ్వించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో రోజు జేమ్స్ అండర్సన్-శుభ్‌మన్ గిల్‌తో మొదలైన మాటల యుద్ధం శనివారం ఆటలోనూ కొనసాగుతోంది.
గొడవ అయిన కాసేపటికే గిల్‌ను అండర్సన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అండర్సన్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. కాగా, శుక్రవారం ఆటలో మార్క్‌వుడ్-సర్ఫరాజ్ కూడా వాగ్వాదానికి దిగేలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అయితే ఇవాళ ఆటలో గిల్‌తో బెయిర్‌స్టో గొడవకు దిగాడు. బెయిర్ స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్లిప్‌లో గిల్, లెగ్‌స్లిప్‌లో సర్ఫరాజ్ ఉన్నారు. వారి ముగ్గురు మధ్య సంభాషణ ఇలా సాగింది.

బెయిర్‌స్టో: అండర్సన్‌తో అలసిపోయి ఏం మాట్లాడావు? ఆ తర్వాత ఔట్ అయ్యావ్ కదా?
శుభ్‌మన్ గిల్: అయితే ఏంటి? సెంచరీ సాధించిన తర్వాత ఔటయ్యా. ఇప్పుడు నువ్వు ఎన్ని పరుగులు చేశావు?సర్ఫరాజ్ ఖాన్: ఏదో కొన్ని పరుగులు చేసి.. ఇవాళ అతిగా ఎగిరిపడుతున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో 31 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. మూడు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు పడ్డాడు. జోరు మీదున్న బెయిర్‌స్టోను కుల్‌దీప్ తన తొలి ఓవర్‌లోనే ఔట్ చేశాడు. ఔటైన అనంతరం గిల్‌ను బెయిర్‌స్టో సీరియస్ చూస్తూ మైదానాన్ని వీడాడు.
ఈ సిరీస్‌లో బెయిర్‌స్టో దారుణంగా విఫలమయ్యాడు. అయిదు టెస్టుల్లో 238 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు ఇవాళ సాధించిన 39 పరుగులే. అంతేగాక ఈ టెస్టు సిరీస్‌లో బెయిర్‌స్టో కంటే కుల్‌దీప్ యాదవ్ ఎక్కువ బంతులు ఎదుర్కొన్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కుల్‌దీప్ 362 బంతులు ఎదుర్కోగా, మరోవైపు బెయిర్‌స్టో పది ఇన్నింగ్స్‌ల్లో 290 బంతులే ఆడాడు. కాగా, ఆఖరి టెస్టులోనూ ఇంగ్లండ్ ఓటమి దిశగా వెళ్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 118 పరుగుల వెనుకంజలో ఉంది.