For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరైన సమయంలో జో రూట్ సాహసం..రివ్యూకి వెళ్లి మరీ కీలక వికెట్ సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్!మ్యాచ్ మలుపు అదే!

IND vs ENG: Joe Root takes DRS on right time, Cheteshwar Pujara gone for 91

లీడ్స్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా తృటిలో సెంచరీ కోల్పోయాడు. మ్యాచ్‌లో నాలుగో రోజైన శనివారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 91తో బ్యాటింగ్ కొనసాగించిన పుజారా (91: 189 బంతుల్లో 15x4) అదే స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. ఈ రోజు 9 బంతులాడిన పుజారా.. కనీసం ఒక్క పరుగు కూడా జత చేయలేకపోయాడు. పుజారా చివరిగా 2019 జనవరిలో సెంచరీ నమోదు చేశాడు. పూజి సెంచరీ చేయక సరిగ్గా 968 రోజుల అవుతోంది. దీంతో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు:

ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు:

శనివారం ఓవర్‌నైట్ స్కోరు 215/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. అదే స్కోరు వద్ద చతేశ్వర్ పుజారా వికెట్ చేజార్చుకుంది. ఫుల్ లెంగ్త్ బంతుల్ని పుజారా డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ మంచి టచ్‌లోనే కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 84వ ఓవర్ వేసిన ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని పుజారా ఆడకుండా వదిలేశాడు. కానీ బంతి నేరుగా వచ్చిన అతని ఫ్యాడ్స్‌ని తాకింది. దాంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం ఇంగ్లండ్ జట్టు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.

రూట్ తీసుకున్న డీఆర్‌ఎస్ వల్లే:

రూట్ తీసుకున్న డీఆర్‌ఎస్ వల్లే:

అయితే చతేశ్వర్ పుజారా తమకు కీలక వికెట్ అనుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సాహసం చేసి మరి డీఆర్‌ఎస్ కోరాడు. రిప్లైలో బంతి ఆఫ్ స్టంప్‌ని తాకేలా కనిపించింది. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని పుజారా ఔట్‌గా ప్రకటించాడు. ఇంకేముంది ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. సరైన సమయంలో జో రూట్ సాహసం చేసి మంచి బ్రేక్ త్రూ సాదించాడు. పుజారా ఔట్ అనంతరం భారత్ టపటపా వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ ఇలా స్టార్ ఆటగాళ్లు అందరూ పెవిలియన్ చేరారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ ఓటమికి దగ్గరైంది. రూట్ తీసుకున్న డీఆర్‌ఎస్ వల్లే ఇంగ్లండ్ విజయం అందుకుంటోంది.

దెబ్బకొట్టిన రాబిన్సన్‌:

దెబ్బకొట్టిన రాబిన్సన్‌:

చతేశ్వర్ పుజారా (91) రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే అర్ధ సెంచరీ (55) పూర్తి చేసుకున్న కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. వీరిద్దరినీ ఓలి రాబిన్సన్ వెనక్కి పంపాడు. అప్పటికి టీమిండియా స్కోరు 237 పరుగులు. ఆ తర్వాత రెండు పరుగులకే అజింక్య రహానే (10) అవుట్ కాగా.. అదే స్కోరు వద్ద రిషబ్ పంత్ (1) పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రహానే ఈ మ్యాచ్‌లోనూ అదే చెత్త ఫామ్ కొనసాగించాడు. మరోవైపు పంత్ కూడా బ్యాట్‌కు పనిచెప్పలేకపోయాడు.

నాలుగు రాబిన్సన్‌కే:

నాలుగు రాబిన్సన్‌కే:

మరికాసేపటికే మొహమ్మద్ షమీ (6)ని మొయిన్ అలీ బోల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఇషాంత్ శర్మ (2) ఓలి రాబిన్సన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఓటమి అంచున నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా అండతో రవీంద్ర జడేజా భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు రాబిన్సన్‌కే దక్కడం గమనార్హం. మొత్తంగా రాబిన్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి.. ఇంగ్లండ్ కంటే 90 పరుగుల దూరంలో ఉంది. జడేజా (17), బుమ్రా (0) క్రీజులో ఉన్నాడు.

Story first published: Saturday, August 28, 2021, 22:07 [IST]
Other articles published on Aug 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+