Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అప్పటివరకు ఆడతాను.. లెజెండరీ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు

IND vs ENG: లీడ్స్ మైదానంలో జస్‌ప్రీత్ బుమ్రా మాయాజాలం కొనసాగింది. బుమ్రా మరోసారి ఇంగ్లండ్ బ్యాటర్లకు నరకం చూపించాడు. జస్‌ప్రీత్ బుమ్రా తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు. బుమ్రా ముందు ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్ తీవ్రంగా ఇబ్బంది పడింది. అద్భుత స్పెల్ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా తన వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై అడిగిన ప్రశ్నకు నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చాడు. దేవుడు రాసినంత కాలం తాను ఆడతానని.. జనాల పని మాత్రం మాట్లాడడమేనని భారత ఫాస్ట్ బౌలర్ అన్నాడు.

వర్క్ లోడ్‌పై బుమ్రా ఏమన్నాడంటే?
మూడో రోజు ఆట ముగిసిన తర్వాత జస్‌ప్రీత్ బుమ్రాను వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి అడిగినప్పుడు అతను ఇలా అన్నాడు. "జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పడు వెళ్తాడు.. అప్పుడు వెళ్తాడు అని మాట్లాడుకుంటారు. నేను 10 నుంచి 12 ఏళ్లుగా ఆడుతున్నాను. ఐపీఎల్ ఆడతాను. దేవుడు రాసినంత కాలం ఆడుతూనే ఉంటాను. నేను ఊహాగానాలను నియంత్రించలేను. కానీ నేను నా సన్నాహాలపై మాత్రమే దృష్టి పెడతాను. మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను." అని జస్‌ప్రీత్ బుమ్రా పేర్కొన్నారు.

IND vs ENG Jasprit Bumrah s Fiery Spell and Strong Words Will Play As Long As God Wills

ఫీల్డర్లను వెనకేసుకొచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా
లీడ్స్ టెస్ట్ మూడో రోజు జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో నాలుగు క్యా‌చ్‌లు వదిలివేయబడ్డాయి. ఈ క్రమంలో భారత ఫీల్డర్ల పేలవ ప్రదర్శన గురించి బుమ్రాను అడిగినప్పుడు.. అతను ఫీల్డర్లకు మద్దతుగా నిలిచాడు. జస్‌ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. క్యాచ్‌లు జారిపోవడం ఆటలో ఒక భాగమని.. ఇది ఎవరూ కావాలని చేయరన్నారు. ఆటగాళ్లు అనుభవం ద్వారానే నేర్చుకుంటారని జస్‌ప్రీత్ బుమ్రా స్పష్టం చేశాడు.

విధ్వంసం సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా
జస్‌ప్రీత్ బుమ్రా లీడ్స్ మైదానంలో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్ జట్టును 465 పరుగులకే కట్టడి చేయగలిగింది. జస్‌ప్రీత్ బుమ్రా తన స్పెల్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, టంగ్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. విదేశీ గడ్డపై అత్యధికంగా 5 వికెట్లు తీసిన వారిలో జస్‌ప్రీత్ బుమ్రా కపిల్ దేవ్‌తో సమం చేశాడు. బుమ్రా ఇప్పటివరకు స్వదేశం వెలుపల ఆడుతూ ఒక ఇన్నింగ్స్‌లో 12 సార్లు 5 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ ఈ ఘనతను 66 టెస్టు మ్యాచ్‌లలో సాధించగా, జస్సీ కేవలం 34 టెస్టు మ్యాచ్‌లలోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

Story first published: Monday, June 23, 2025, 9:34 [IST]
Other articles published on Jun 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+