For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: అనిల్‌ కుంబ్లే సరసన జేమ్స్‌ అండర్సన్‌.. మరో వికెట్ తీస్తే!!

IND vs ENG: James Anderson Equals Anil Kumbles record of 619 wickets in Tests
Ind vs Eng 2021 : James Anderson Equals Anil Kumble's Record || Oneindia Telugu

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌ సీనియర్‌ ఫాస్ట్ బౌలర్‌, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌ 39 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. వయసుతో సంబంధం లేకుండా.. వికెట్ల వేటే లక్ష్యంగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్మీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే సరసన చేరాడు. టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

కుంబ్లే రికార్డు సమం:

కుంబ్లే రికార్డు సమం:

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ రికార్డును జేమ్స్ అండర్సన్‌ అందుకున్నాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఒకే ఓవర్‌లో నయా వాల్ చెతేశ్వర్‌ పుజారా (4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (0)లను పెవిలియన్‌ చేర్చడంతో ఈ కీలక మైలురాయిని జిమ్మీ చేరుకున్నాడు. 41వ ఓవర్‌లో జిమ్మీ వరుస బంతుల్లో ఇద్దరినీ బోల్తా కొట్టించాడు. 2003లో అరంగేట్రం చేసిన అండర్సన్‌.. కెరీర్ ఆరంభం నుంచే విజయవంతమైన పేసర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే 163వ టెస్టులో కుంబ్లే రికార్డును చేరుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో మరో వికెట్‌ తీస్తే జంబోను జిమ్మీ అధిగమించి కొత్త రికార్డు సృష్టిస్తాడు.

తొలి ఫాస్ట్ బౌలర్:

తొలి ఫాస్ట్ బౌలర్:

జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌తో మాజీ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్‌ను వెన‌క్కి నెట్టిన జేమ్స్‌ అండర్సన్‌.. ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 163 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 619 వికెట్లు తీశాడు. ఐదు వికెట్ల ప్రదర్శన 30సార్లు చేశాడు. అలిస్టర్‌ కుక్‌ 161 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. కుక్ 12,472 పరుగులు చేశాడు. కుక్‌ తర్వాత స్టువర్ట్‌ బ్రాడ్‌ 149 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌ 523 వికెట్లు పడగొట్టటాడు. ఇక టెస్టుల్లో 600 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్‌ బౌలర్లలో అండర్సన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

2003లో అరంగేట్రం:

2003లో అరంగేట్రం:

2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన జేమ్స్‌ అండర్సన్.. ఇప్పటివరకు 619 వికెట్లు తీశాడు. అందులో 27సార్లు నాలుగు వికెట్ల ఘనతను, 30సార్లు ఐదు వికెట్ల హాల్స్ అందుకున్నాడు. షార్టెస్ట్ ఫార్మాట్‌లో 194 వన్డేలు 19 టీ20లు ఆడిన జిమ్మీ.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 269 వికెట్లు, పొట్టి క్రికెట్‌లో 18 వికెట్లు తీశాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ ఓటమికి అండర్సన్‌ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఐదు మ్యాచుల ఈ టెస్ట్ సిరీసులో జిమ్మీ కీలకం కానున్నాడు. సొంత గడ్డపై తన స్వింగ్ ప్రభావాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

అడ్డుపడ్డ వరుణుడు:

అడ్డుపడ్డ వరుణుడు:

తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా మూడోసారి ఆటకు అంతరాయం కలిగింది. రెండో సెషన్‌లో భారత్ 46.1 ఓవర్ల వద్ద 125/4 స్కోరుతో కొనసాగుతున్న వేళ వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మొదటిసారి ఆటను నిలిపివేశారు. కాసేపటికే వర్షం కురవడంతో ఆట మరింత ఆలస్యమైంది. దీంతో టీ విరామం ముందుగానే తీసుకున్నారు. ఆపై వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో అంపైర్లు ఆటను కొనసాగించారు. జేమ్స్ అండర్సన్‌ ఒక బంతి వేయగానే మళ్లీ వర్షం కురిసింది. దాంతో రెండోసారి ఆటను ఆపేశారు. కాసేపటికే వర్షం నిలిచిపోవడంతో ఆటను కొనసాగించారు. అండర్సన్‌ మరో రెండు బంతులు వేయగానే వర్షం మరోసారి అడ్డుపడింది. దాంతో మూడోసారి ఆగిపోయింది.

Story first published: Thursday, August 5, 2021, 22:44 [IST]
Other articles published on Aug 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+