For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జైస్వాల్ 200..సర్ఫరాజ్ మెరుపులు..భారీస్కోరుకు భారత్ డిక్లేర్ (Video)

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు భారత్‌ 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (91; 154 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68*; 72 బంతుల్లో) సత్తాచాటారు.

ఆదివారం ఆటను భారత్ ఆచితూచి ప్రారంభించింది. నైట్‌వాచ్‌మన్ కుల్‌దీప్ యాదవ్ కుల్‌దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో)తో కలిసి గిల్ స్కోరుబోర్డు నడిపించాడు. చెత్తబంతుల్ని బౌండరీకి తరలిస్తూ వీరిద్దరు పరుగులు సాధించారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కుల్‌దీప్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి నో చెప్పడంతో గిల్ వెనుదిరిగాడు. కాసేపటికే కుల్‌దీప్ కూడా ఔటయ్యాడు.

IND vs ENG: Jaiswal Double Century an Sarfaraz sparks Innings helps Indias huge score

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. శనివారం ఆట ముగిసేసమయానికి యశస్వి జైస్వాల్‌ 104 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కానీ గిల్ ఔటైన తర్వాత తిరిగి బరిలోకి దిగాడు. సాధికారికంగా ఆడుతూ పరుగులు వరద పారించాడు. సిక్సర్లు వర్షం కురిపించాడు. అండర్సన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదడం ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.

మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ కూడా తగ్గేదేలే అంటూ బౌండరీల మోత మోగించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా మరో హాఫ్ సెంచరీ బాదాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్‌కు ఇంగ్లండ్ నిస్ససహాయంగా కనిపించింది. ఈ క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, జో రూట్, టామ్ హర్ట్‌లీ తలో వికెట్ తీశారు. రోహిత్ శర్మ (19) పరుగులు చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 557 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది.

Story first published: Sunday, February 18, 2024, 14:01 [IST]
Other articles published on Feb 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+