For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదేందెయ్యా ఇది.. ఇలాంటి పిచ్ ఎప్పుడూ చూడలే! - బెన్ స్టోక్స్

అయిదు టెస్టుల సిరీస్‌లో మరో సమరానికి భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. రాంచీ వేదికగా రేపటి నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన టీమిండియానే రాంచీ టెస్టులో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్‌ను తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు.

రాంచీ పిచ్‌ గురించి ఎలాంటి అభిప్రాయానికి రాలేకపోతున్నామని బెన్ స్టోక్స్ వాపోయాడు. ఈ వికెట్‌పై ఎలా ఆడాలో తెలియట్లేదని, పిచ్‌పై పచ్చికతో పాటు పగుళ్లు కూడా ఉన్నాయని అన్నాడు. ''ఈ వికెట్ మీకు ఆసక్తిగా అనిపిస్తుందా? నాకైతే ఏం తెలియట్లేదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఇంతకుముందు ఇలాంటి పిచ్‌ను ఎప్పుడూ చూడలేదు''

IND vs ENG: Ive never seen something like that Ranchi Wicket before - Ben Stokes

''ఓ ఎండ్‌లో ఒకలా, మరో ఎండ్‌లో భిన్నంగా ఉంది. భారత్‌ వెలుపల మైదానాల్లో ఒక అంచనాకు రావచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు పిచ్‌పై పచ్చిక ఉంది. కానీ లోతుగా పరిశీలిస్తే.. డిఫ్రెంట్‌గా ఉంది. చాలా డార్క్‌గా, కొన్నిచోట్ల పగుళ్లు కనిపిస్తున్నాయి'' అని బెన్ స్టోక్స్ తెలిపాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఒలీ పోప్ కూడా రాంచీ పిచ్ స్వభావాన్ని అంచనా వేయలేకపోతున్నామని తెలిపాడు.

కుడి చేతి ఆఫ్ స్టంప్ వైపు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నట్లుగా ఉందని, కానీ ఎడమచేతి వాటం ఆఫ్ స్టంప్ వైపు పిచ్ భిన్నంగా ఉందని పోప్ తెలిపాడు. పిచ్‌పై చాలా పగుళ్లు ఉన్నాయని, అలాగే ఫ్లాట్‌గా కూడా కనిపిస్తుందని పేర్కొన్నాడు. రేపు పిచ్ ఎలా ఉంటుందో మరోసారి పరిశీలిస్తామని, దీనిపై టీమిండియా ఎలా స్పందిస్తుందని ఎదురుచూస్తున్నామని పోప్ వెల్లడించాడు. కాగా, తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ తర్వాత రెండు టెస్టుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ రికార్డు విజయాన్ని నమోదుచేసింది.

IND vs ENG: Ive never seen something like that Ranchi Wicket before - Ben Stokes

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్

ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, ఒలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్ , షోయబ్ బషీర్

Story first published: Thursday, February 22, 2024, 11:04 [IST]
Other articles published on Feb 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+