For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు.. అందుకే ఐదో టెస్టును ర‌ద్దు చేశాం! ఇక సిరీస్ ముగిసింది: గంగూలీ

IND vs ENG: IPL 2021 Has Noting To Do With 5th Test Cancellation Says BCCI President Sourav Ganguly
Ind vs Eng 2021 : BCCI Offers To Play 2 Extra T20Is In England Next Year || Oneindia Telugu

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాధ్యతారహితమైన బోర్డు కాదని, ఇతర బోర్డులను ఎప్పుడూ గౌరవిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. మ్యాచుకు కొన్ని గంట‌ల ముందు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్ర‌క‌టించగా.. దీనిపై ఇప్ప‌టికే ఇంగ్లిష్ మీడియా ర‌చ్చ‌ర‌చ్చ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసమే భారత్ ఇలా చేసిందని.. అస‌లు హెడ్ కోచ్ ర‌విశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీని బుక్‌లాంచ్ ఈవెంట్‌కు ఎవ‌రు వెళ్ల‌మ‌న్నార‌ని అక్క‌డి మీడియా ప్రశ్నిస్తోంది.

బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు:

బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు:

ఐదో టెస్ట్ రద్దవడంపై ఇంగ్లండ్ మీడియా టీమిండియాపై నానా నింద‌లూ వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్పందించాడు. ద టెలిగ్రాఫ్‌తో మాట్లాడిన దాదా .. ఐదవ టెస్ట్ ఆడడానికి టీమిండియా ప్లేయ‌ర్స్ సుముఖంగా లేని విష‌యం నిజ‌మేన‌న్నాడు. ఐదవ టెస్టును రద్దు చేయడంలో ఐపీఎల్ 2021 పాత్ర ఉందా? అని అడిగినప్పుడు.. 'లేదు.. లేదు. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు. ఇతర బోర్డులను ఎప్పుడూ గౌరవిస్తుంది. ఎవరికీ నష్టం వాటిల్లే విధంగా బీసీసీఐ వ్యవహరించదు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లేయర్స్ ఆరోగ్యమే ముఖ్యం' అని గంగూలీ అన్నాడు.

 క‌రోనా సోకుతుంద‌ని భ‌య‌ప‌డ్డారు:

క‌రోనా సోకుతుంద‌ని భ‌య‌ప‌డ్డారు:

'ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ప్లేయ‌ర్స్ నిరాక‌రించారు. కానీ వాళ్ల‌ను కూడా ఈ విష‌యంలో అసలు నిందించ‌లేం. ఫిజియో యోగేశ్ పార్మ‌ర్ అప్ప‌టికే ప్లేయ‌ర్స్‌తో ట‌చ్‌లో ఉన్నాడు. నితిన్ ప‌టేల్ కూడా ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన త‌ర్వాత యోగేశ్ ఒక్క‌డే సహాయ బృందంలో మిగిలిపోయాడు. యోగేశ్ ప్ర‌తి రోజూ ఆటగాళ్లకు మ‌సాజ్ చేసేవాడు. అత‌నికి క‌రోనా సోకింద‌ని తెలియ‌గానే.. ప్లేయ‌ర్స్ అందరూ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ‌కూ క‌రోనా సోకుతుంద‌ని భ‌య‌ప‌డ్డారు' అని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ వెల్ల‌డించాడు. బ‌బుల్‌లో ఉండ‌టం అంత తేలికైన విష‌యం కాద‌ని కూడా ఈ సంద‌ర్భంగా దాదా పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు గత కొన్ని నెలలుగా తీరికలేని క్రికెట్ ఆడుతున్నారు, ప్లేయ‌ర్స్ ఫీలింగ్స్‌ను కూడా మ‌నం అర్థం చేసుకోవాలన్నాడు.

 టెస్ట్ సిరీస్ ఇక ముగిసిపోయింది:

టెస్ట్ సిరీస్ ఇక ముగిసిపోయింది:

'ఐదవ టెస్ట్ మ్యాచ్ వ‌ల్ల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) న‌ష్ట‌పోయిన విష‌యం తెలుసు. కానీ ముందు ఈ గంద‌ర‌గోళం తొల‌గిపోతే త‌ర్వాత ఓ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. ఈ టెస్ట్ సిరీస్ ఇక ముగిసిపోయింది. వ‌చ్చే ఏడాది ఎప్పుడు ఆ టెస్ట్ ఆడినా.. అది ఏకైక మ్యాచ్ సిరీస్ అవుతుంది. ఈ నెల 22న నేను లండ‌న్ వెళ్తున్నాను. మ్యాచ్‌ల‌ను వాయిదా వేయ‌డం అంత సులువు కాదు. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ ఇలా జ‌ర‌గ‌దు' అని సౌరవ్ గంగూలీ స్ప‌ష్టం చేశాడు. దాదా మాటలను బట్టి చూస్తే.. టెస్ట్ సిరీస్ 2-1తో భారత్ సొంతమయినట్టే. దాంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై కోహ్లీసేన చరిత్ర సృష్టించినట్టే.

22న లండ‌న్‌కు దాదా:

22న లండ‌న్‌కు దాదా:

ఐదో టెస్ట్ మ్యాచ్‌ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్‌లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్ళినపుడు.. రద్దైన ఐదో టెస్టుకు బదులుగా రెండు టీ20లు షెడ్యూల్‌లో చేర్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని ఈసీబీకి కూడా చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ వ్యవహారంపైనే దాదా ఈ నెల 22న నేను లండ‌న్ వెళ్తున్నాడు.

Story first published: Monday, September 13, 2021, 13:51 [IST]
Other articles published on Sep 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+