Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: 3-1 తేడాతో గెలవడం ఖాయం.. సచిన్ టెండూల్కర్ జోస్యం

IND vs ENG Test Series: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నేడు(జూన్ 20) ప్రారంభం కానుంది. హెడింగ్లే, లీడ్స్‌లో శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా తమ కీలక ఆటగాళ్లు లేకుండా కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక టెస్ట్ సిరీస్‌కు ముందు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కీలక అంచనా వేశారు.

సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం ప్రకారం.. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఇంగ్లండ్ జట్టును ఓడించనుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్ జట్టును 3-1 తేడాతో ఓడిస్తుందని సచిన్ టెండూల్కర్ అన్నారు. అంతే కాకుండా 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ టెస్ట్ సిరీస్ గెలుస్తుందని కూడా జోస్యం చెప్పారు. ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ .. "నేను భారత్ 3-1తో గెలుస్తుందని అంచనా వేస్తున్నాను." అని వెల్లడించారు.

IND vs ENG India to Win Test Series 3-1 Predicts Sachin Tendulkar

2007లో చివరిసారిగా సిరీస్ గెలిచిన భారత్
2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టులో సచిన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ గెలవలేదు. సచిన్ టెండూల్కర్ 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌కు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. శుభ్‌మన్ గిల్‌ 32 మ్యాచ్‌లు ఆడిన తర్వాత భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా మారాడు. ఈ పర్యటనలో శుభ్‌మన్ గిల్‌ అద్భుతమైన ప్రదర్శన చేస్తారని సచిన్ టెండూల్కర్ నమ్ముతున్నారు. ఇంగ్లండ్‌లో విజయవంతం కావడానికి సచిన్ టెండూల్కర్ సూత్రాన్ని కూడా వివరించారు. అక్కడి పరిస్థితులు బ్యాటింగ్ చేయడానికి కఠినంగా ఉంటాయని ఆయన అన్నారు.

నంబర్ 4లో ఆడే విషయంలో ఏమన్నారంటే?
భారత్ తరఫున ఆడటం ఒక పెద్ద బాధ్యత అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. భారత్ కోసం ఆడటమే ఒక బాధ్యత అని.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా ఆ పరుగులు చాలా అమూల్యమైనవని తెలిపారు. 11వ నంబర్ కూడా వేరే సామర్థ్యంలో బాధ్యతను నిర్వర్తిస్తుందన్నారు. ఆ(నంబర్ 4) బాధ్యతను గిల్ నిర్వర్తించగలడని ప్రజలు నమ్మడం మంచి విషయమన్నారు. ప్రజలకు అతనిపై ఉన్న అంచనాలు సానుకూల సంకేతమని.. ఎందుకంటే ప్రజలకు అతనిపై నమ్మకం ఉందన్నారు. గిల్ ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు.

Story first published: Friday, June 20, 2025, 11:40 [IST]
Other articles published on Jun 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+