Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సర్ఫరాజ్ కోసమే అలా చేశా.. అది టర్నింగ్ పాయింట్ - రోహిత్

టెస్టు చరిత్రలో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఈ ఘనత సాధించింది. 577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ విజయం. ఈ క్రమంలో అయిదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.

విజయంలో రోహిత్ శర్మది కీలకపాత్ర. టాస్ గెలిచి కూడా తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును జడేజాతో కలిసి రోహిత్ ఆదుకున్నాడు. సెంచరీ (131)తో సత్తాచాటాడు. మూడో రోజు ఆటలో రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు దూరమైన మిగిలిన బౌలర్లు గొప్పగా ఉపయోగించుకుని ఇంగ్లండ్‌‌పై తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించాడు. అంతేగాక ఎటాకివ్ ఫీల్డింగ్ మోహరించి 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ‌ 122 పరుగులకే ఆలౌట్ చేయడంలో కెప్టెన్‌గా దిగ్విజయ పాత్ర పోషించాడు.

IND vs ENG: I did that for Sarfaraz and that was the turning point - Rohit Sharma

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. అశ్విన్ దూరమవ్వడంతో తమ బౌలర్లుకు ప్రశాంతంగా ఉండమని సూచించామని రోహిత్ చెప్పాడు. ''టెస్టు క్రికెట్ ఆడుతున్నామంటే 2-3 రోజుల్లో ముగిసిపోదు. అయిదు రోజుల పాటు ఆట కొనసాగేలా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. తొలుత ఇంగ్లండ్ బాగా ఆడింది. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. కానీ మా వద్ద క్లాస్ బౌలింగ్ ఉంది. శాంతంగా ఉండమని మా బౌలర్లకు సూచించాం. మూడో రోజు ఆటలో మా బౌలర్లు గొప్పగా సత్తాచాటారు. వాళ్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. ఇలాంటివి జరిగినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది'' అని అన్నాడు.

33/3తో తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జడేజా అయిదో స్థానంలో బ్యాటింగ్ రావడంపై రోహిత్ స్పందించాడు. ''ఆ ఇన్నింగ్స్ పరిస్థితుల వల్ల అతడు అయిదో స్థానమని అనుకున్నాం. జడేజాకు ఎంతో అనుభవం ఉంది. కీలక సమయాల్లో పరుగులు సాధించాడు. అంతేగాక రైట్-లెఫ్ట్ కాంబో ఆడాలని భావించాం. దాంతో పాటు సర్ఫరాజ్ గురించి ఆలోచించాం. సర్ఫరాజ్‌ క్వాలిటీ బ్యాటర్. అయితే అరంగేట్రం చేస్తున్న అతడికి కాస్త మంచి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు పంపించాలనుకున్నాం. బ్యాటుతో తాను ఏం సాధించగలడో మనం చూశాం''

''అయితే బ్యాటింగ్ ఆర్డర్ ఇలానే సాగుతుందని అనుకోవట్లేదు (జడేజా అయిదో స్థానం గురించి). అప్పటి పరిస్థితలుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ విషయానికొస్తే.. చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది టాస్ గెలవడం. భారత్‌లో టాస్ గెలవడం చాలా కీలకం. ఇక మూడో రోజు ఆటలో మా బౌలర్లు తమ సత్తాచూపించారు. అనుభవజ్ఞుడు అశ్విన్ దూరమైనా అదరగొట్టారు''

''బ్యాటింగ్‌లో సగం పనిని పూర్తి చేశాం. యువకులు జైస్వాల్, సర్ఫరాజ్ భారీ ఆధిక్యాన్ని అందించారు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జైస్వాల్ గురించి ఇప్పటికే ఎన్నో చెప్పా. వైజాగ్‌లో కూడా అతడి నైపుణ్యం గురించి మాట్లాడాను. అతడి గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు. అతడు తన కెరీర్ ఉన్నత స్థాయితో ప్రారంభించాడు. అదే ప్రదర్శన అతడు కొనసాగించాలని కోరుకుంటున్నా. అతడు మంచి ఆటగాడు'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలింది. జడేజా అయిదు వికెట్లతో సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. అయితే 224/2తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లండ్ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 430/4 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214*), శుభ్‌మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68*) అదరగొట్టారు.

Story first published: Sunday, February 18, 2024, 19:36 [IST]
Other articles published on Feb 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+