Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మహ్మద్ సిరాజ్ X హ్యారీ బ్రూక్ మధ్య తీవ్ర వాగ్వాదం!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య హెడింగ్లీలో ఉత్కంఠభరితమైన టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. జూన్ 20న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. భారత జట్టు ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై బాగా ఇబ్బంది పెట్టింది. మొదటి టెస్ట్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 471 పరుగులు చేసింది. అయితే అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కూడా 465 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, హ్యారీ బ్రూక్‌ల మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

లైవ్ మ్యాచ్‌లో సిరాజ్, బ్రూక్ గొడవ
మూడో రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మహ్మద్ సిరాజ్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. స్టార్ స్పోర్ట్స్ తమ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో మహ్మద్ సిరాజ్ బంతిని వేసిన తర్వాత హ్యారీ బ్రూక్‌ను చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. సిరాజ్ చాలా కోపంగా కనిపించాడు. ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మూడో రోజు ఆటలో చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అయితే హ్యారీ బ్రూక్ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచిపోయాడు. హ్యారీ బ్రూక్‌ను 99 పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు. టెస్టుల్లో ఇప్పటివరకు హ్యారీ బ్రూక్ భారత్‌పై ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.

IND vs ENG Heated Exchange Between Mohammad Siraj and Harry Brook on the Field

96 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
లీడ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 96 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 47 పరుగులతో క్రీజులో ఉండగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

Story first published: Monday, June 23, 2025, 11:06 [IST]
Other articles published on Jun 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+