Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ కుర్రాడిపై వేటు వేయకండి - డివిలియర్స్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కుర్రాళ్లకు టీమిండియా యాజమాన్యం అవకాశాలు ఇచ్చింది. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, బౌలర్ ఆకాశ్ దీప్ వాటిని సద్వినియోగం చేసుకున్నారు. కానీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ నిరాశపరిచాడు. వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన అతడు గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.

రజత్ పటిదార్ స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. వైజాగ్ టెస్టు (33, 9 పరుగులు) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెహాన్ అహ్మద్ బౌలింగ్ వెనుదిరిగాడు. అలాగే రాజ్‌కోట్ టెస్టులో (5, 0) టామ్ హర్ట్‌లీ బౌలింగ్‌లో, రాంచీ టెస్టులో (17, 0) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో రజత్ పటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్ అవకాశాలు ఇవ్వాలనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ధర్మశాల టెస్టు‌లో పడిక్కల్ అరంగేట్రం ఖాయమని వార్తలు కూడా వస్తున్నాయి.

IND vs ENG: Give chances to Rajat Patidar even if he fails -AB de Villiers

ఈ నేపథ్యంలో రజత్ పటిదార్‌కు సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచాడు. గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడనప్పటికీ రజత్‌కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో సత్తాచాటుతున్న టీమిండియా రజత్‌ను కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

''ఈ సిరీస్‌లో జీవితాంతం గుర్తుండిపోయే ప్రదర్శన రజత్ పటిదార్ చేయలేదు. కానీ భారత క్రికెట్‌లో ఓ మంచి సంస్కృతి ఉంది. జట్టు గొప్పగా ఆడుతూ, విజయాల బాటలో ఉంటే ఆటగాళ్లకు అవకాశాలు కొనసాగిస్తారు. రజత్ పటిదార్‌కు సామర్థ్యం ఉండి, డ్రెస్సింగ్ రూమ్‌లో అతడిపై మంచి అభిప్రాయం ఉంటే.. రోహిత్, తుది జట్టును ఎంపిక చేసే ప్యానెల్‌ అతడిని జట్టులో ఉంచుతారు. ప్రస్తుతం రజత్ పటిదార్ పరుగులు సాధించనప్పటికీ అతడిపై నమ్మకం ఉంటే అతడికి అవకాశాలు ఇవ్వాలి'' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.

మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఆఖరి టెస్టు జరగనుంది. అయిదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమి అనంతరం రోహిత్ సేన పుంజుకుని వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసింది.

Story first published: Friday, March 1, 2024, 17:17 [IST]
Other articles published on Mar 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+