ఇదెక్కడి మాస్ మూమెంట్ రా మామా..!!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంకాసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. కొద్దిసేపటి కిందటే టాస్ పడింది. ఇంగ్లాండ్ జట్టు కేప్టెన్ జోస్ బట్లర్- టాస్ గెలుచుకున్నాడు. తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. ఛేజింగ్ చేసే అవకాశాన్ని భారత్‌కు ఇవ్వలేదు. ఛేజింగ్‌లో టీమిండియా ఎంత దూకుడుగా ఆడుతుందో బాగా తెలిసిన అనుభవం ఉండటం వల్లేనేమో- టాస్ గెలిచిన జోస్.. తొలుత ఫీల్డింగ్‌నే ఎంచుకున్నాడు.

13న ఫైనల్‌లో..
భారత్-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ ఓవల్‌లో జరగబోతోన్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్స్ ఆడుతుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనూహ్య పరిస్థితులు, అనేక ట్విస్టుల తరువాత పాకిస్తాన్.. ఫైనల్‌లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సూపర్ 12 దశలో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా దారుణంగా ఓడిపోవడం పాకిస్తాన్‌కు ప్లస్ పాయింట్. అదే సమయంలో బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించింది.
స్టేడియం వద్ద సందడి..
మ్యాచ్- దానిపై వెలువడుతోన్న అంచనాలు, వ్యక్తమౌతోన్న అభిప్రాయాలు, ప్రిడిక్షన్స్.. ఇవన్నీ ఒక ఎత్తయితే- ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న అడిలైడ్ ఓవల్ స్టేడియం వద్ద అభిమానుల హంగామా మరో ఎత్తు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం.. ఈ ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు ఓవల్ స్టేడియానికి చేరుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడుస్తూ సందడి చేస్తోన్నారు. మేళ తాళాలు, బాజా భజంత్రీలతో హోరెత్తిస్తోన్నారు.

ఆకాశమే హద్దుగా..
మ్యాచ్ సమయం సమీపిస్తోన్న కొద్దీ- అభిమానుల కోలాహలం మరింత తీవ్రతరం అయింది. పంజాబీ స్టైల్‌లో డాన్సులు చేయడం కనిపించింది. తప్పెట్ల శబ్దంతో అడిలైడ్ ఓవల్ పరిసర ప్రాంతాలన్నీ మారుమోగిపోయాయి. స్టేడియం లోపల-బయటా ఇదే పరిస్థితి. చుట్టు పక్కల వాతావరణం అంతా ఓ మాస్ సినిమా జాతరను తలపించింది. అడిలైడ్ ఓవల్ స్టేడియం పూర్తి సామర్థ్యం 53,500 కాగా మొత్తం నిండిపోయింది.

మినీ ఇండియాగా..
అడిలైడ్ మొత్తం ఇవ్వాళ ఓ మినీ ఇండియాలా మారిపోయింది. అక్కడ స్థిరపడిన వేర్వేరు రాష్ట్రాలకు చెందిన భారతీయులు- తమ సంప్రదాయాలను ప్రతిబింబిచేలా వస్త్రధారణ చేసుకుని మరీ స్టేడియానికి వచ్చారు. వెంట తెచ్చుకున్న వాహనాలకు మువ్వన్నెల పతాకాన్ని అతికించారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించడం కనిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే- దీనికి మించిన ఊర మాస్ జాతర అడిలైడ్‌లో నెలకొంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications