For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేచేతులా రెండో టెస్టు జారవిడుచుకున్న భారత్

By Nageswara Rao
VVS Laxman
నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 319 పరుగుల భారీ తేడాతో అవమానకర రీతిలో ఓటమి పాలైంది. విజయం కోసం 478 పరుగులు చేయాల్సిన భారత్‌ కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. అత్యంత చెత్త ఆటను కనబరిచిన టీమిండియా సిరీస్‌లో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసుకొంది. నాలుగో రోజే విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించడమే కాకుండా టెస్టుల్లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను ఖాయం చేసుకొంది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను స్టువర్ట్‌ బ్రాడ్‌ ప్రారంభంలోనే దెబ్బతీశాడు. ద్రవిడ్‌ను ఔట్‌ చేయడం ద్వారా బ్రాడ్‌ టీమిండియా వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత అండర్సన్‌, బ్రెస్నన్‌లు విజృంభించడంతో భారత్‌ మళ్లిd కోలుకోలేక పోయింది. మాస్టర్‌ సచిన్‌ (56), హర్భజన్‌ (46), ప్రవీణ్‌ (25) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకోగా మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రెస్నన్‌ ఐదు, అండర్సన్‌ మూడు, బ్రాడ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరిచిన బ్రాడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ధి మ్యాచ్‌ అవార్డు దక్కింది.

క్లిష్టమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే కోలుకోలేని షాక్‌ తగిలింది. ఫాంలో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ (6)ను స్టువర్ట్‌ బ్రాడ్‌ పెవిలియన్‌ పంపాడు. ఆ వెంటనే వివిఎస్‌. లక్ష్మణ్‌(4) కూడా అండర్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత కొద్ది సేపటికే ఓపెనర్‌ ముకుంద్‌ 41 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రైనా (1), యువరాజ్‌ సింగ్‌ (8), కెప్టెన్‌ ధోనీ (0)లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. దీంతో టీమిండియా 55 పరుగులకే 6 వికెట్టు కోల్పోయింది. ఒక వైపు వికెట్లు పడుతున్న సచిన్‌ మాత్రం క్రీజులో నిలబడి పరుగులు చేస్తూ టీమిండియా స్కోరును పెంచాడు. అతనికి అండగా హర్భజన్‌ నిలువడంతో కొద్ది సేపు స్కోరు బోర్డు వేగం అందుకుంది. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సచిన్‌ 8 ఫోర్లతో 56 పరుగులు చేసి అండర్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

మరోవైపు వేగంగా ఆడిన హర్భజన్‌ 46 పరుగులు చేశాడు. చివర్లో ప్రవీణ్‌ కుమార్‌ (25), ఇషాంత్‌ శర్మ (8 నాటౌట్‌), శ్రీశాంత్‌ (0) పరుగులు చేశారు. దీంతో టీమిండియా 158 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు 441/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 544 పరుగులకు ఆలౌటైంది. ప్రియర్‌ (73), బ్రెస్నన్‌ (90), బ్రాడ్‌ (44) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. దీంతో ఇంగ్లండ్‌ భారత్‌ ముందు 478 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో ప్రవీణ్‌కు నాలుగు, ఇషాంత్‌, శ్రీశాంత్‌లకు తలొ రెండేసి వికెట్లు దక్కాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+