Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు.. ఆధిక్యంలోకి ఇంగ్లండ్!!

Ind vs Eng: England take lead as openers Haseeb Hameed, Rory Burns solid start

హెడ్డింగ్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ భారత బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటున్నారు. ఇదే పిచ్‌పై భారత బ్యాట్స్‌మన్‌ తడబడగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. ఇంగ్లీష్ ఓపెనర్లు సమయోచితంగా ఆడుతూ నెమ్మదిగా పరుగులు పెంచుకుంటూ పోతున్నారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేపదే బౌలర్లను మార్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఇంగ్లండ్ 35 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసింది. దీంతో రూట్ సేన 17 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బర్న్స్ (45), హమీద్ (42) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ అండ‌ర్స‌న్, ఓలి రాబిన్సన్‌, సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్ దెబ్బకు భారత్ 40.4 ఓవర్లలో 78 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన 19 పరుగులే అత్యధికం. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్‌లో 22 పరుగులు చేసి కూప్పకూలింది. కేఎల్ రాహుల్‌ (0), చతేశ్వర్ పుజారా (1), విరాట్‌ కోహ్లీ (7), రిషబ్ పంత్ (2), రవీంద్ర జడేజా (4) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు. అండర్సన్ 3, ఓవర్టన్‌ 3 వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెన‌ర్, సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (0; 4 బంతుల్లో) డ‌కౌట‌య్యాడు. జేమ్స్ అండ‌ర్స‌న్ వేసిన తొలి ఓవ‌ర్‌ ఐదవ బంతికే కీప‌ర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. బంతిని డ్రైవ్‌ చేయబోగా.. బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ చేతుల్లో పడింది. రాహుల్ అనంతరం క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ చేతేశ్వర్ పుజారా (1; 9 బంతుల్లో) కూడా నిరాశపరిచాడు. అండర్సన్‌ వేసిన 4.1వ బంతికి అతడు కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో భారత్ నాలుగు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

చేతేశ్వర్ పుజారా అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. జేమ్స్ అండర్సన్‌ నిప్పులు చేరగడంతో తన సహజ శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. అనవసర షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకున్నాడు. అయితే అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10.5 ఓవర్‌కు కోహ్లీ ఔట్ అయ్యాడు. కీపర్‌ బట్లర్‌కి అతడు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 7 పరుగులకే ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ గతి తప్పింది. విరాట్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానేతో కలిసి రోహిత్ నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు.

అజింక్య రహానే, రోహిత్ శర్మ ఇద్దరూ సమయోచితంగా ఆడారు. రోహిత్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయినా.. రహానే సింగిల్స్ తీస్తూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 18 పరుగులు చేసిన రహానే క్రీజులో కుదురుకున్నట్టుగానే కనిపించాడు. అయితే అంతలోనే ఓలి రాబిన్సన్‌కు చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం లంచ్ బ్రేక్‌కు వెళ్లింది భారత్. ఇక లంచ్ అనంతరం సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్ చెలరేగడంతో భారత్ ఆరు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (2), రవీంద్ర జడేజా (4), మొహ్మద్ షమీ (0), జస్ప్రీత్ బుమ్రా (0)లు ఔట్ అయ్యారు. ఇషాంత్ శర్మ (8 నాటౌట్) స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేయగా.. మొహ్మద్ సిరాజ్ (3) ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Story first published: Wednesday, August 25, 2021, 22:49 [IST]
Other articles published on Aug 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+