Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: సిరీస్‌లో ఫస్ట్ టైమ్.. బతికిపోయిన ఇంగ్లండ్

రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలోనే నిలిచింది. శుక్రవారం ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (106*; 226 బంతుల్లో) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. అతడికి తోడుగా క్రీజులో ఒలీ రాబిన్సన్ (31*; 60 బంతుల్లో) ఉన్నాడు.

తొలి రోజు ఆటలో ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోటీ సాగింది. అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ చెలరేగడంతో ఇంగ్లండ్ 57 పరగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్ (42; 42 బంతుల్లో), ఒలీ పోప్ (0; 2 బంతుల్లో), జాక్ క్రాలే (11; 21 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. జడేజా, అశ్విన్ కూడా బంతిని తిప్పడంతో ఇంగ్లండ్ 112 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

IND vs ENG: England didnt lose any wicket for the first time in a session this series

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ ఫోక్స్ (47; 126 బంతుల్లో) కలిసి జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. వీరద్దరు జాగ్రత్తగా ఆడటంతో రెండో సెషన్‌లో ఇంగ్లండ్ వికెట్ కోల్పోలేదు. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఓ సెషన్‌లో ఇంగ్లండ్ వికెట్‌ పడకుండా ఆడటం ఇదే తొలిసారి.

అయితే ఆఖరి సెషన్ ప్రారంభంలో మహ్మద్ సిరాజ్ చెలరేగడంతో స్వల్పవ్యవధిలోనే ఇంగ్లిష్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఫోక్స్‌తో పాటు హర్ట్‌లీని సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాబిన్సన్‌తో కలిసి రూట్ ఎనిమిదో వికెట్‌కు అభేద్యమైన అర్ధశతక (57) భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. ఈ క్రమంలో 219 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. టెస్టు చరిత్రలో భారత్‌పై పది శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా జో రూట్ చరిత్రకెక్కాడు. కాగా, భారత్ బౌలర్లలో అకాశ్ దీప్‌ మూడు వికెట్లు, సిరాజ్‌ రెండు, జడేజా, అశ్విన్‌ చెరో వికెట్ తీశారు.

Story first published: Friday, February 23, 2024, 17:10 [IST]
Other articles published on Feb 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+