ఉప్పల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ ఇంగ్లిష్ ఓపెనర్లు బెన్ డకెట్ (35; 39 బంతుల్లో), జాక్ క్రాలే (20; 40 బంతుల్లో) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 11 ఓవర్లలోనే అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కానీ ఆ తర్వాత భారత స్పిన్నర్లు రంగంలోకి దిగేసరికి ఇంగ్లాండ్ కథ మారిపోయింది.
55/0తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ అశ్విన్, జడేజా ధాటికి 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్ (29; 60 బంతుల్లో), బెయిర్ స్టో (37; 58 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నిదానంగా ఆడుతూ 108/3తో లంచ్ విరామానికి వెళ్లారు.

రెండో సెషన్ ఆరంభంలోనే కుదురుకున్న రూట్‌ను జడేజా, బెయిర్ స్టోను అక్షర్ పటేల్ ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు షాకిచ్చారు. అనంతరం బెన్ స్టోక్స్ (70; 88 బంతుల్లో) ఇన్నింగ్స్ బాధ్యతలు అందుకున్నాడు. టెయిలెండర్స్‌తో కలిసి స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. మరోవైపు భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ల తీస్తూ ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో టీ విరామ సమాయానికి ఇంగ్లిష్ జట్టు 215/8తో నిలిచింది.
అయితే చివరి సెషన్ ఆరంభం నుంచి బెన్ స్టోక్స్ చెలరేగాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు సాధించాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అనంతరం మరింత ప్రమాదకరంగా మారుతూ వేగంగా పరుగులు సాధించాడు. అయితే బుమ్రా అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో అతడి పోరాటం ముగిసింది. ఇంగ్లాండ్ 246 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు, అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. నాలుగు ఓవర్లే బౌలింగ్ వేసిన లోకల్ బాయ్ సిరాజ్ వికెట్ సాధించలేదు.