IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ చాలా చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు బంతి మార్పుపై పెద్ద వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్ల తర్వాత రూల్స్ ప్రకారం భారత్ కొత్త బంతిని అందుకుంది. అయితే 10 ఓవర్లు పూర్తయ్యేసరికే బంతి ఆకారం దెబ్బతిన్నది. భారత ఆటగాళ్ల ఫిర్యాదులో బంతిని పరిశీలించిన అంపైర్ మరో బాల్‌ను తెప్పించాడు. 10 ఓవర్లు మాత్రమే ఆడిన బాల్ తీసుకొచ్చాడు. అయితే ఈ బంతి పాతదానికి కంటే మరి ఘోరంగా ఉండటంతో భారత ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయాన్ని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేయగా.. అతను వినిపించుకోలేదు. దాంతో మరింత అసహానానికి గురైన గిల్.. అంపైర్‌తో గొడవపడ్డాడు. ఇప్పుడు జో రూట్ దీనిపై స్పందించాడు.
డ్యూక్ బాల్ వివాదంపై జో రూట్ ప్రకటన
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జో రూట్ బంతి మార్పుపై మాట్లాడాడు. టీమిండియా తీరుపై రూట్ ప్రశ్నలు లేవనెత్తాడు. డ్యూక్స్ బంతి మార్పుపై ఇంత చర్చ అవసరం లేదని జో రూట్ అభిప్రాయపడ్డాడు. జో రూట్ మాట్లాడుతూ.. "ఒక వేళ బంతి ఆకారం దెబ్బతింటే దానిని మార్చుకోవాలి. కానీ దీనిపై ఎటువంటి రాద్ధాంతం చేయకూడదు. ఇక్కడ ప్రపంచం అంతమైపోయిందని నేను అనుకోవడం లేదు. ఇది ఆటలో ఒక కొత్త మలుపు తీసుకువస్తుందని నేను భావిస్తున్నాను. మార్పులకు అనుగుణంగా మారే సామర్థ్యం మీకు ఉండాలి. దాని వల్ల స్వింగ్ ఆగిపోయినా లేదా మరింత పెరిగినా సరే రాణించే కెపాసిటీ ఉండాలి." అంటూ జో రూట్ అభిప్రాయపడ్డాడు.

లార్డ్స్ టెస్టులో జో రూట్ సెంచరీ
లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జో రూట్ 199 బంతుల్లో 104 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 10 ఫోర్లు కొట్టగలిగాడు. లార్డ్స్‌లో జో రూట్ రికార్డు అద్భుతంగా ఉంది. జో రూట్ మరోసారి అదే తరహా ప్రదర్శన చేశాడు. జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసింది.
రెండో రోజు 3 వికెట్లు కోల్పోయిన భారత్
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన చేసింది. రెండో రోజు చివరి నాటికి టీమిండియా ఆటగాళ్లు 43 ఓవర్లు ఆడి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ ప్రస్తుతం 53 పరుగులతో నాటౌట్‌గా ఉండగా.. కరుణ్ నాయర్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌తో పాటు రిషబ్ పంత్ 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత జట్టుకు మూడో రోజు చాలా కీలకం.