టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. మైదానంలో జట్టును గొప్పగా నడిపించే రోహిత్.. ఆటగాళ్లతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అసభ్య పదాలతో దూషిస్తాడు, మరికొన్నిసార్లు మెచ్చుకుంటాడు. అయితే తాజాగా సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి రోహిత్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 47వ ఓవర్‌ను కుల్‌దీప్ బౌలింగ్ చేశాడు. అయితే ఓవర్ మధ్యలో రోహిత్ ఫీల్డింగ్ మార్పులు చేశాడు. సర్ఫరాజ్‌ను ఫార్వర్డ్ షార్ట్ లెగ్ పొజిషనల్‌లో ఉండమని సూచించాడు. అది బ్యాటర్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఫీల్డర్లకు అది కాస్త ప్రమాదకరమైన ఫీల్డింగ్ స్థానం.

అయితే సర్ఫరాజ్ హెల్మెట్ లేకుండానే ఆ స్థానంలో ఫీల్డింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో సర్ఫరాజ్‌పై కెప్టెన్ రోహిత్ సీరియస్ అయ్యాడు. 'నువ్వు ఏమైనా హీరో అవ్వాలనుకుంటున్నవా' అని సర్ఫరాజ్‌ను మందలించాడు. డగౌట్ నుంచి కేఎస్ భరత్ హెల్మెట్ తీసుకుని రావడంతో.. సర్ఫరాజ్ హెల్మెట్ ధరించి ఫీల్డింగ్ కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్లేయర్లపై కేరింగ్‌ను రోహిత్ ఇలా ఇండైరెక్ట్‌గా చూపిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, నాలుగో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 152 పరుగుల దూరంలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసేసరికి టీమిండియా 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (16; 21 బంతుల్లో) ఉన్నారు.
అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్‌దీప్ యాదవ్ (4/22) మాయాజాలానికి ఇంగ్లిష్ జట్టు విలవిలలాడింది. జాక్ క్రాలే (60; 91 బంతుల్లో) టాప్ స్కోరర్. బెన్ డకెట్ (15; 15 బంతుల్లో), ఒలీ పోప్ (0; 1 బాల్), జానీ బెయిర్‌స్టో (30; 42 బంతుల్లో), టామ్ హర్ట్‌లీ (7; 25 బంతుల్లో), రాబిన్సన్ (0, 3 బంతుల్లో), బెన్ ఫోక్స్ (17;76 బంతుల్లో), జో రూట్ (11), బెన్ స్టోక్స్ (4) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులు, ఇంగ్లండ్ 353 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (90; 149 బంతుల్లో) రాణించాడు.