Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: శుభ్‌మన్ గిల్ వికెట్ తీసేందుకు ఇంత నీచానికి దిగజారాలా? (వీడియో)

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్‌‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజు శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించగా.. అంతకు ముందు యశస్వి జైస్వాల్(87) కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చినా తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మార్చలేకపోయాడు. మ్యాచ్ సమయంలో ఇంగ్లీష్ బౌలర్ బ్రైడన్ కార్స్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయాలనే ఆతృతలో నీచమైన పనికి పాల్పడ్డాడు. కానీ శుభ్‌మన్ గిల్ అతడి మోసాన్ని పసిగట్టాడు.

రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారత్‌కు ఆరంభం సరిగ్గా లేదు. కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్ మధ్య 80 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. మొదటి సెషన్‌లోనే శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌‌కు వచ్చాడు. రెండో సెషన్‌లో జైస్వాల్‌తో కలిసి ఇంగ్లాండ్‌ను వికెట్ కోసం తహతహలాడించారు. ఈ మధ్యలో బ్రైడన్ కార్స్ ఈ మోసానికి పాల్పడ్డాడు.

IND vs ENG Did Brydon Carse Cheat to Dismiss Shubman Gill Watch the Controversial Video

బ్రైడన్ కార్స్ ఏం చేశాడంటే?
ఇంగ్లాండ్ బౌలర్ బ్రైడన్ కార్స్ 34వ ఓవర్లో బంతిని వేయడానికి వస్తున్నాడు. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. కానీ బ్రైడన్ కార్స్ బంతి వేసేందుకు పరిగెత్తుకుంటూ వస్తూనే ఎడమ చేతి వేలితో వేరే వైపునకు సైగ చేశాడు. ఇది బహుశా బ్యాటర్ దృష్టిని మరల్చడానికి కావచ్చు. 2014 ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్ షేన్ వాట్సన్‌తో ఇలాంటిదే చేశాడని గుర్తుండే ఉంటుంది.

అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్రైడన్ కార్స్ చేసిన ఈ మోసాన్ని పసిగట్టాడు. శుభ్‌మన్ గిల్ బంతిని ఆడకుండా.. బంతిని వేయడానికి ముందే వెనక్కి తగ్గాడు. ఆగ్రహించిన శుభ్‌మన్ గిల్ బౌలర్‌కు ఏదో చెప్పాడు. బ్యాటర్‌ను ఔట్ చేసేందుకు బ్రైడన్ కార్స్ ఎలాంటి నీచమైన ఎత్తుగడను ఉపయోగించాలనుకున్నాడో మీరు వీడియోలో చూడవచ్చు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
శుభ్‌మన్ గిల్ మొదటి రోజు తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ కెరీర్లో 16వ, 7వ టెస్ట్ సెంచరీ. శుభ్‌మన్ గిల్ 114 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ రోజు రెండో రోజు తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తాడు. గిల్ తో పాటు రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొదటి రోజు భారత్ స్కోరు 310/5. మొదటి రోజు ఇంగ్లాండ్ తరఫున క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. కేఎల్ రాహుల్(2), నితీష్ కుమార్ రెడ్డి(1)లను క్రిస్ వోక్స్ ఔట్ చేశాడు. యశస్వి జైస్వాల్(87)ను బెన్ స్టోక్స్ ఔట్ చేశాడు. రిషబ్ పంత్(25) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.

Story first published: Thursday, July 3, 2025, 12:17 [IST]
Other articles published on Jul 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+