Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూపర్ మ్యాన్‌లా రనౌట్ చేసిన ధ్రువ్ జురెల్.. డైవ్ చేస్తూ! (Video)

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 50 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్ (4; 15 బంతుల్లో), జాక్ క్రాలే (11; 26 బంతుల్లో), ఒలీ పోప్ (3; 14 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో (4; 3 బంతుల్లో), జో రూట్ (7; 40 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.

అయితే ఇంగ్లండ్ తొలి వికెట్ రనౌట్ రూపంలో కోల్పోయింది. ఏడో ఓవర్‌లో బుమ్రా వేసిన తొలి బంతిని మిడ్‌వికెట్ మీదగా డకెట్ డిఫెండ్ షాట్ ఆడాడు. ఆ తర్వాత సింగిల్‌కు ప్రయత్నించాడు. సగం పిచ్ వరకు పరిగెత్తాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న క్రాలే పరుగుకు నిరాకరించడంతో తిరిగి వెనక్కి పరిగెత్తాడు. ఈ లోపు సిరాజ్ ఒంటిచేత్తో బంతిని అందుకుని మెరుపు వేగంతో త్రో వేశాడు.

IND vs ENG: Dhruv Jurels brilliant wicket keeping helps Duckett run out

మరోవైపు సిరాజ్ గురిపెట్టి విసిరిన స్టంప్స్ వెనుక బంతిని అందుకోవడానికి ఏ ఫీల్డర్ లేరు. దీంతో బుమ్రా బౌలింగ్‌కు చాలా దూరంలో వికెట్‌కీపింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ పరిగెత్తుకువచ్చాడు. సూపర్ మ్యాన్‌లా వచ్చి కష్టమైన ఆ త్రోను అందుకొని డైవ్ చేస్తూనే వికెట్లను గిరాటేశాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ రనౌట్ తర్వాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 50/5 స్కోరు చేసింది. క్రీజులో స్టోక్స్ (15*), బెన్ ఫోక్స్ ఉన్నారు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (91; 154 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68*; 72 బంతుల్లో) సత్తాచాటారు.

నైట్‌వాచ్‌మన్ కుల్‌దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో)తో కలిసి గిల్ స్కోరుబోర్డు నడిపించాడు. చెత్తబంతుల్ని బౌండరీకి తరలిస్తూ వీరిద్దరు పరుగులు సాధించారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కుల్‌దీప్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి నో చెప్పడంతో గిల్ వెనుదిరిగాడు. కాసేపటికే కుల్‌దీప్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు.

అయిదో వికెట్‌కు అజేయంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జైస్వాల్ 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, జో రూట్, టామ్ హర్ట్‌లీ తలో వికెట్ తీశారు. రోహిత్ శర్మ (19) పరుగులు చేశాడు.

Story first published: Sunday, February 18, 2024, 15:40 [IST]
Other articles published on Feb 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+