Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధ్రువ్ జురెల్ సిక్సర్‌.. బిత్తరపోయిన ఇంగ్లండ్ స్టార్‌ పేసర్ (Video)

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే ఓవర్‌నైట్ స్కోరు 326/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కాసేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. నైట్‌వాచ్‌మన్‌గా గురువారం ఆటకు వచ్చిన కుల్‌దీప్ యాదవ్ (4; 24 బంతుల్లో)ను జేమ్స్ అండర్సన్ ఔట్ చేశాడు. తర్వాత ఓవర్‌లో సెంచరీ హీరో రవీంద్ర జడేజా (112; 225 బంతుల్లో)ను జో రూట్ బోల్తాకొట్టించాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్ర ప్లేయర్ ధ్రువ్ జురెల్ (12*; 36 బంతుల్లో)తో కలిసి రవిచంద్రన్ అశ్విన్ (22*; 51 బంతుల్లో) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. అయితే తన తొలి టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ సమర్థవంతంగా ఢిపెన్స్ ఆడుతున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా కచ్చితత్వంతో షాట్లు ఆడుతున్నాడు.

IND vs ENG: Dhruv Jurel shocks Englands Pacer Mark Wood for upper cut sixer

అయితే ధ్రువ్ జురేల్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ పరీక్షించాలనుకున్నాడు. బౌన్సర్‌తో ఇబ్బంది పెట్టాలని భావించించాడు. ఆఫ్‌స్టంప్‌గా బౌన్సర్ విసిరాడు. అయితే ధ్రువ్ జురెల్ ఆ బంతిని సమయస్ఫూర్తితో ఆడాడు. శాంతంగా స్లిప్స్ మీదుగా అప్పర్ కట్ షాట్ ఆడాడు. బంతిని సిక్సర్‌గా మలిచాడు. అరంగేట్ర ప్లేయర్ నుంచి టెస్టుల్లో ఆ షాట్‌ను ఊహించని ఇంగ్లండ్ ప్లేయర్లు బిత్తరపోయారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు పేలవ ఆరంభం లభించిన విషయం తెలిసిందే. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ (131; 196 బంతుల్లో), రవీంద్ర జడేజా గొప్పగా పోరాడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్ 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రోహిత్ ఔటైన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వన్డే తరహాలో బౌండరీల మోత మోగించాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. జడేజా అనవసరపు పరుగుకు ప్రయత్నించి సర్ఫరాజ్‌ను రనౌట్ చేశాడు. కాగా, జైస్వాల్ (10), రజత్ పటిదార్ (5), గిల్ (0) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు, టామ్ హర్ట్‌లీ, అండర్సన్, జో రూట్ తలో వికెట్ తీశారు.

Story first published: Friday, February 16, 2024, 11:01 [IST]
Other articles published on Feb 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+