
ఎల్లుండి తొలి సెమీస్..
ఇక ఎల్లుండి నుంచి సెమీ ఫైనల్స్ మొదలు కానున్నాయి. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య జరుగనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ టోర్నమెంట్‌లో మొట్టమొదటగా సెమీ ఫైనల్స్ చేరిన జట్టు న్యూజిలాండ్. సూపర్ 12 దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్‌ను ఓడించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఇంగ్లాండ్‌తో పోరులో ఓడింది.

తప్పుకొందనుకున్న దశలో...
దాదాపు సెమీ ఫైనల్స్ రేసు నుంచి తప్పుకొన్న పాకిస్తాన్ చివరికి ఈ అవకాశాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీ ఫైనల్స్ ఆడే అవకాశాన్ని పాకిస్తాన్ అందిపుచ్చుకుంది. సూపర్ 12 దశలో తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ 12లో భారత్, జింబాబ్వే చేతిలో పరాజయాన్ని చవి చూసింది పాకిస్తాన్. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై విజయాలతో తన పాయింట్ల సంఖ్యను పెంచుకుంది.

10న రెండో సెమీఫైనల్..
ఈ నెల 10వ తేదీన రెండో సెమీ ఫైనల్ షెడ్యూల్ అయింది. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్‌పై కన్నేశాయి. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాయి. ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు జట్లు కూడా సూపర్ 12 దశలో సూపర్‌గా రాణించాయి.

ఊహించని షాక్..
కాగా భారత్‌తో సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తమౌతోన్న ఇంగ్లాండ్‌ను ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మలన్.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉంటోన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో గజ్జల్లో నొప్పితో డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు.

మలన్ స్థానంలో..
డేవిడ్ మలన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. సెమీ ఫైనల్స్‌కు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నందున అతను కోలుకుంటాడని ఆశిస్తోంది ఈసీబీ. మలన్ అందుబాటులో లేకపోతే మాత్రం ప్రత్యామ్నాయంగా రిజర్వ్ ప్లేయర్‌ను తుదిజట్టులోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. రిజర్వ్ ప్లేయర్లుగా ల్యూక్ వుడ్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ అందుబాటులో ఉన్నారు.

ఫిల్ సాల్ట్‌కు ఛాన్స్..
జోస్ బట్లర్‌తో కలిసి ప్రస్తుతం ఓపెనింగ్ పార్టనర్‌గా ఇన్నింగ్‌ను ఆరంభిస్తోన్నాడు అలెక్స్ హేల్స్. అతన్ని అలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రెండో ప్రత్యామ్నాయంగా టోర్నమెంట్‌లో ఇంకా ఆడని ఫిల్ సాల్ట్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. జేమ్స్ విన్స్, జేసన్ రాయ్, సామ్ బిల్లింగ్స్ పేర్లను కూడాపరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు. ఫిల్ సాల్ట్‌తో జోస్ బట్లర్ ఇన్నింగ్‌ను ఆరంభించే అవకాశాలు లేకపోలేదంటూ స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ అంచనా వేస్తోన్నాయి.


Click it and Unblock the Notifications












