For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: జో రూట్ వికెట్‌పై వివాదం.. ఇంగ్లండ్ ఫిర్యాదుకు ఎంసీసీ వివరణ!

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి ఇంగ్లండ్ జట్టుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ నిపుణులు నోటికొచ్చినట్లు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని లేదా మ్యాచ్ డ్రా అవుతుందని అభిమానులు ఊహించారు. ఇంగ్లండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలంటే జో రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశించారు. ఈ దశలో జో రూట్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆకాష్ దీప్ అద్భుతమైన బౌలింగ్‌కు స్టంప్స్ చెల్లాచెదురై ఔటయ్యాడు.

జో రూట్ ఔట్‌పై ఇంగ్లండ్ అభ్యంతరాలు
ఇది మ్యాచ్‌లో కీలక మలుపు తప్పింది. దీని కారణంగా ఇంగ్లండ్ జట్టు 271 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సందర్భంగా ఆకాశ్ దీప్ జో రూట్‌కు వేసిన బంతి "బ్యాక్ ఫుట్ నో బాల్" అని, అంపైర్లు దీనిని నో బాల్‌గా ప్రకటించి ఉండాలని ఇంగ్లండ్ నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల జో రూట్ తప్పుగా ఔటయ్యాడని వారు వాదించారు. దీనిపై భారత అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాష్ దీప్ బంతిని సరైన పద్దతిలో వేశాడని.. ఇంగ్లండ్ ఓడిపోయిన తర్వాత అందుకు కారణాలను వెతుకుతోందని మండిపడ్డారు.

IND vs ENG Controversy over Joe Root s Wicket MCC Clarifies England s No-Ball Complaint

ఎంసీసీ వివరణ
ఈ నేపథ్యంలో ఐసీసీ కోసం నియమాలను రూపొందించి వాటిని పరిరక్షించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(MCC) ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. "బ్యాక్ ఫుట్ నో బాల్" నియమం ప్రకారం.. బౌలర్ మొదట తన కాలు ఎక్కడ పెడితే అది క్రీజు లోపల ఉండాలి. అది లోపల లేకపోతేనే అది నో బాల్ అవుతుంది. అయితే ఆకాష్ దీప్ మొదట తన కాలును సరైన స్థలంలో పెట్టి బంతిని వేసిన తర్వాతే అతని కాలు క్రీజు వెలుపలికి వెళ్లిందని.. కాబట్టి అది నో బాల్ కాదని ఎంసీసీ స్పష్టం చేసింది. ఈ వివరణతో ఇంగ్లండ్ చేసిన ఫిర్యాదుకు తెరపడింది.

Story first published: Tuesday, July 8, 2025, 16:41 [IST]
Other articles published on Jul 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+