Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: లార్డ్స్‌లో అసాధ్యం సాధ్యమా?.. గిల్ సేన చరిత్ర సృష్టిస్తుందా?

IND vs ENG: క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుకు 193 పరుగులు విజయ లక్ష్యంగా నిర్దేశించబడింది. నాలుగో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత జట్టు 58 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. చివరి రోజు 6 వికెట్లు మిగిలి ఉండగా.. ఇంకా 135 పరుగులు చేస్తే విజయం సాధించే స్థితిలో టీమిండియా ఉంది. టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ముఖ్యంగా లార్డ్స్ వంటి బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని. ఈ క్రమంలో లక్ష్యాన్ని ఛేదించి భారత జట్టు విజయం సాధించడం సాధ్యమా అనే సందేహం నెలకొంది. ఎందుకంటే ఇంతకు ముందు లార్డ్స్ మైదానంలో భారత జట్టు చాలా తక్కువ లక్ష్యాన్నే ఛేదించింది. 58 పరుగులకే 4 వికెట్లు పడగొట్టడం కూడా అదే సూచిస్తోంది.

లార్డ్స్‌లో అత్యధిక లక్ష్య ఛేదనలు ఇవే..
లార్డ్స్‌ మైదానం చరిత్రను పరిశీలిస్తే నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 344 పరుగులు విజయవంతంగా ఛేదించబడ్డాయి. 1984లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్ జట్టుపై ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో గార్డన్ గ్రీనిడ్జ్ అజేయంగా 214 పరుగులు సాధించడం గమనార్హం. దీని తర్వాత ఇంగ్లండ్ జట్టు 2004లో న్యూజిలాండ్ జట్టుపై 282 పరుగులను ఛేదించింది. ఇటీవల జూన్ 2025లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాపై 282 పరుగులను ఛేదించి విజయం సాధించింది.

IND vs ENG Can Gill s Team Make History at Lord s A Challenging Chase Awaits India

భారత్ గత రికార్డు ఇదే..
లార్డ్స్ మైదానంలో భారత్ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ చాలా తక్కువగా ఉంది. 1986లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు 136 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయం సాధించింది. ఇదే లార్డ్స్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ విజయవంతంగా ఛేదించిన ఏకైక లక్ష్యం. ఆ తర్వాత 2014, 2021లో సాధించిన విజయాలు రెండూ ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని నిర్దేశించి గెలిచినవే కావడం గమనార్హం.

ప్రస్తుతం 2025లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టుకు 193 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే అది లార్డ్స్ మైదానంలో భారత్ అత్యంత విజయవంతమైన లక్ష్యఛేదనగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో భారత బ్యాటర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి.. ఈ చారిత్రాత్మక విజయాన్ని దేశానికి అంకతం చేస్తారా అనే వేచి చూడాల్సిందే.

Story first published: Monday, July 14, 2025, 12:05 [IST]
Other articles published on Jul 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+