Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెన్‌ స్టోక్స్ మ్యాజిక్.. తొలి బంతికే రోహిత్ క్లీన్‌బౌల్డ్ (Video)

దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి బౌలింగ్ చేశాడు. తొలి బంతికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. శ‌స్త్రచికిత్స అనంతరం బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతూ జట్టును నడిపిస్తున్నాడు. అందుకే గత నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ కష్టాల్లో ఉన్న స్టోక్స్‌ను బంతిని అందుకోలేదు.

కానీ ఎట్టకేలకు తిరిగి బౌలింగ్ చేశాడు. అంతేగాక తన బౌలింగ్ రీఎంట్రీ‌లో అదిరే ఆరంభాన్ని పొందాడు. బంతి గమనాన్ని అంచనా వేయలేపోయిన రోహిత్ బౌల్డయ్యాడు. ఔటైన అనంతరం ఆ బంతిని చూసి ఆశ్చర్యపోయినట్లుగా రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి నిరాశగా మైదానాన్ని వీడాడు. వ్యాఖ్యాతగా ఉన్న సంజయ్ మంజ్రేకర్ ఆ బంతిని మ్యాజికల్ బాల్‌గా అభివర్ణించాడు.

IND vs ENG Ben Stokes magical ball Rohit Sharma clean bowled on the first ball

తర్వాతి ఓవర్‌లోనే జేమ్స్ అండర్సన్ అద్భుతమైన బంతితో శుభ్‌మన్ గిల్ (110; 150 బంతుల్లో)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కుదురుకున్న భారత బ్యాటర్లు స్వల్పవ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. 135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా తొలి సెషన్‌లో సత్తాచాటింది. వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. కానీ రెండో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెంచరీ హీరోలు ఔటయ్యారు. గిల్, రోహిత్ రెండో వికెట్‌కు 171 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ప్రస్తుతం క్రీజులో దేవదత్ పడిక్కల్ (13; 17 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (2; 6 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. 65 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్‌దీప్ యాదవ్ అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) టాప్ స్కోరర్. రెండో అత్యధిక స్కోరు బెయిర్‌స్టో చేసిన 29 పరుగులు (18 బంతుల్లో). అనంతరం గురువారమే భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది.
యశస్వీ జైస్వాల్ (57; 58 బంతుల్లో) హాఫ్‌సెంచరీ సాధించిన అనంతరం ఔటయ్యాడు.

Story first published: Friday, March 8, 2024, 13:00 [IST]
Other articles published on Mar 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+