For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 5th Test: రంగంలోకి సౌరవ్ గంగూలీ.. సెప్టెంబర్‌ 22న ఇంగ్లండ్‌కి పయనం! ఎందుకో తెలుసా?

IND VS ENG: BCCI president Sourav Ganguly to travel to England for rescheduling 5th Test

ముంబై: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఐదో టెస్టు రద్దవ్వడం అందర్నీ నిరాశకు గురిచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను నిలిపివేసినా భవిష్యత్‌లో తిరిగి నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసక్తి చూపుతోంది. మరోవైపు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ఇదో టెస్ట్ మ్యాచ్ జరగాలని కోరుకుంటోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత భారత్​తో 3 వన్డేలు, 3 టీ20లు ఇంగ్లీష్ జట్టు ఆడనుంది. ఆ సమయంలో ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

మ్యాచ్‌ రద్దు:

మ్యాచ్‌ రద్దు:

ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అతడితో పలువురు భారత ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్నారని తెలిసింది. దాంతో ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా తేలింది. అయినా భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈసీబీ, బీసీసీఐ బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్‌ ఫలితం కూడా తేలాల్సి ఉంది.

రీషెడ్యూల్‌ కోసం రంగంలోకి గంగూలీ:

రీషెడ్యూల్‌ కోసం రంగంలోకి గంగూలీ:

ఐదో టెస్ట్ మ్యాచ్‌ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్‌లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడని తెలిసింది. సెప్టెంబర్‌ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్‌ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం. ఆ సమావేశం అనంతరం ఐదో టెస్ట్ ఎప్పుడు జరగనుందనేది తేలనుంది. దాదాపుగా వచ్చే ఏడాదే మ్యాచ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

భారత్ తప్పిదాన్ని ఎత్తిచూపిన ఈసీబీ:

భారత్ తప్పిదాన్ని ఎత్తిచూపిన ఈసీబీ:

ఇక టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గత వారం హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా వైరస్ సోకింది. అనంతరం ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌ కరోనా వచ్చింది. దాంతో భారత్ తప్పిదాన్ని ఈసీబీ ఎత్తిచూపుతోంది. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ ఆ పబ్లిక్ ఈవెంట్‌కి కనీసం ఈసీబీ నుంచి పర్మీషన్ కూడా తీసుకోలేదట. ఈసీబీ ఇద్దరిపై మండిపడినా.. విషయం మాత్రం బయటికి రాలేదని తెలుస్తోంది.

గవాస్కర్ సూచన అదే:

గవాస్కర్ సూచన అదే:

2008లో ముంబైలో దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్​ 26) కటక్​లో భారత్​, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ ఉంది. దాడుల కారణంగా 7మ్యాచ్​ల సిరీస్​లోని చివరి రెండు వన్డేలను రద్దు చేశారు. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు​ స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్​ల టెస్టు సిరీస్​పై సందిగ్ధత నెలకొంది. అయితే టెస్టు సిరీస్​ ఆడటానికి మళ్లీ భారత్​కు తిరిగొచ్చింది ఇంగ్లండ్. తొలుత అనుకున్న షెడ్యూల్​ ప్రకారం అహ్మదాబాద్​, ముంబైలో కాకుండా అహ్మదాబాద్​, చెన్నైలలో మ్యాచులు జరిగాయి. ఈ సిరీస్​లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 0-1తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆ విషయాన్ని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ గుర్తుచేస్తూ.. 2008లో ఇంగ్లండ్ ​చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని చెప్పాడు. ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్​ కోసం ఇంగ్లీష్ జట్టు​ మళ్లీ భారత్​కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపించాలన్నాడు.

Story first published: Saturday, September 11, 2021, 14:58 [IST]
Other articles published on Sep 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+