Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి వన్డే: కోహ్లీకి ముద్దులు వర్షం కురిపించిన అనుష్క (వీడియో)

 IND vs ENG: Anushka Sharma Flying Kiss her Hubby Virat Kohli 1st ODI Match

హైదరాబాద్: సుదీర్ఘమైన సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. క్రికెటర్లతో పాటు వారి భార్యలు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అనుష్క శర్మ, అయేషా, సాక్షి, గ్రేసియా, రితిక టీమిండియా ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు.

ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డే కోహ్లీసేన 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి వన్డేకు క్రికెటర్ల భార్యలు సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, హాఫ్ సెంచరీలు నమోదు చేసినప్పుడు వీరంతా గ్యాలరీలో కూర్చుని చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ తన భర్త, కెప్టెన్ కోహ్లీకి ముద్దులు విసురుతూ కనిపించింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో భారత జట్టు విజయం సాధించగానే అనుష్క శర్మతోపాటు ధావన్ భార్య అయేషా గ్యాలరీలో నిలబడి చప్పట్లు కొడుతూ కోహ్లీ, ధావన్‌లకు ముద్దులు విసిరారు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం లార్డ్స్ వేదికగా రెండో వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ దక్కించుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్‌ రెండో వన్డేలో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది. కాగా, ఇంగ్లాండ్‌తో మూడో టీ20 తర్వాత అనుష్క మైదానంలోకి వచ్చి కోహ్లీని కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, July 13, 2018, 18:26 [IST]
Other articles published on Jul 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+