IND vs ENG: అజింక్య రహానే.. నీవల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదు! ఇక రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంట్లో కూర్చో!!

హైదరాబాద్: టెస్ట్ ఫార్మాట్‌లో భారత జట్టు ప్రధాన బలం బ్యాటింగ్. ఈ బలంతోనే గత కొన్నేళ్లుగా టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు చేసింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై వరుసగా రెండు సార్లు ఓడించి చరిత్ర సృష్టించింది. సేనపై సిరీస్ విజయాలు అందుకుంది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ ఇప్పుడు ఆ బలమే పెద్ద బలహీనతగా మారింది. బ్యాటింగ్ వైఫల్యమే డబ్ల్యూటీసీ టైటిల్‌ను చేజార్చింది. ఇంగ్లండ్ సిరీసులోనూ బ్యాటింగ్ తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. టీమ్‌కు వెన్నుముకగా భావించే మిడిలార్డర్ దారుణంగా విఫలమవుతోంది. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు వరుసగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా రహానే.
5, 1, 1:
అజింక్య రహానే ఇటీవలి కాలంలో పెద్దగా రాణించడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై ఒక సెంచరీ (మెల్‌బోర్న్ టెస్ట్) చేసిన రహానే.. ఆపై పూర్తిగా విఫలమవుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచులో కూడా మోస్తరు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో 49 పరుగులతో పెవిలియన్ చేరాడు. సరిగ్గా చెప్పాలంటే.. 2020 నుంచి జింక్స్ ఆట అంతంత మాత్రమే. ఈ రెండు సంవత్సరాలలో రహానే 13 మ్యాచ్‌లు, 12 ఇన్నింగ్స్‌ల్లో 25.76 సగటుతో 541 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ టీంతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ రహానే పరుగులు చేయలేకపోతున్నాడు. తొలి టెస్టులో 5, 1తో తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో టెస్టులోనూ 1 పరుగుకే పెవిలియన్ చేరాడు.
నీవల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదు:
ఇదే తరహా ప్రదర్శన రెండో ఇన్నింగ్స్‌లో కూడా కొనసాగిస్తే అజింక్య రహానేపై వేటు పడటం ఖాయం. వైస్ కెప్టెన్సీ హోదా రహానేను బతికించినా.. ఇంకెన్నాళ్లు ఆ పదవి కాపాడలేడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీనో లేక స్పూర్తిదాయకమైన పోరాటం చేస్తే తప్పా.. అతను జట్టులో కొనసాగడం కష్టం. అంతేకాకుండా మిగిలిన టెస్టుల్లో కూడా తమను తాము నిరూపించుకోకపోతే రహానే పని ఖతం అయినట్టే. రహానే ప్రదర్శనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'రహానే.. నీవల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇక రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంట్లో కూర్చో జింక్స్' అని మరొకరు ట్వీట్ చేశారు. 'ఇక భారత్ వెళ్లిపో', 'మిగతా రెండు టెస్టులకు విశ్రాంతి తీసుకో' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పుజారా సైతం:
మరోవైపు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ చతేశ్వర్ పుజారా వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. అంతకు ముందు ఆ తర్వాత పెద్దగా రాణించిందేం లేదు. 2019లో అతను చివరిసారిగా సెంచరీ చేశాడు. గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న పుజారా.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ విఫలమయ్యాడు. తనకు చావో రేవోగా మారిన కీలక మ్యాచ్‌లోనూ చేతులెత్తేశాడు. 23 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో పుజారా జట్టులో ఉండటం అవసరమా? అనే ప్రశ్న తలెత్తుంది. పుజారా బదులుగా మయాంక్ అగర్వాల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, షా వంటివారికి అవకాశాలు ఇవ్వలనే డిమాండ్ పెరుగుతోంది.
364 పరుగులకు ఆలౌట్:
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ పేసర్ మార్క్ వుడ్ వేసిన 126.1 ఓవర్‌కు రవీంద్ర జడేజా (40) ఔటయ్యాడు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొహ్మద్ సిరాజ్ (0) నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (129) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో జిమ్మీ ఐదు వికెట్లు తీయడం ఇది 31వసారి కావడం విశేషం. ఓలి రాబిన్‌సన్, మార్క్ వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications