Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీపై 3 రాష్ట్రాల CMలు కామెంట్స్.. ఇప్పుడిదే హాట్ టాపిక్!!

టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ గత కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రీసెంట్ గానే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. విరాట్ పై ప్రశంసల వర్షం కురిపించగా.. ఇప్పుడు మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా పొగిడారు.

ఒకప్పుడు తన అగ్రెసివ్ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఫామ్ అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్ గా న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచిన విరాట్.. త్వరలోనే రంజీ ట్రోఫీ బరిలోకి దిగి ఫామ్ లోకి రావాలని ఆశిస్తున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రారంభించాడు.

IND VS ENG After CM Revanth reddy Chandrababu Naidu Madhya Pradesh Chief Minister Mohan Yadav also praises Virat Kohli Video goes viral

ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తనకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పారు. "కోహ్లీ నా ఫేవరెట్ క్రికెటర్. ఎందుకంటే అతడి ప్లేయింగ్ స్టైల్, ఆడే విధానం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా అతడి దూకుడుగా ఆడే తీరంటే ఇంకా ఇష్టం" అని చెప్పుకొచ్చారు. దీంతో క్రికెట్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

రీసెంట్ గానే దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కూడా కోహ్లీ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తో పోటీ గురించి స్పందిస్తూ.. "మాకు ఎటువంటి పోటీ లేదు. సచిన్ తెందుల్కర్, సునీల్ గవాస్కర్ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇది విరాట్ కోహ్లీ యుగం. ఎలా ఆడాలో కోహ్లీ చూపిస్తాడు" అని సమాధానమిచ్చారు.

ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. విరాట్ అంటే తనకు ఇష్టమని చెప్పారు. అలా ముగ్గురు ముఖ్యమంత్రులు విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Story first published: Sunday, January 26, 2025, 13:57 [IST]
Other articles published on Jan 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+