Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shardul Thakur: బ్యాడ్‌లక్ బెన్‌ స్టోక్స్: రెండుసార్లు లైఫ్ ఇచ్చినా.. నిలబెట్టుకోలేకపోయాడేంట్రా

IND vs ENG 5th test day 3: Shardul Thakur cleans Ben Stokes after he drops him in Shamis over

లండన్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య అయిదో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు గేమ్ మొదలైంది. క్రీజ్‌లో ఉన్న కేప్టెన్ బెన్ స్టోక్స్-జానీ బెయిర్ స్టో.. ప్రారంభంలో దూకుడుగా ఆడారు. భారీ షాట్లతో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపారు. బ్యాక్ అండ్ బ్యాక్ ఫోర్లతో విరుచుకుపడ్డారు. వారిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బెయిర్ స్టో హాఫ్ సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే బెన్ స్టోక్స్ పెవిలియన్ దారి పట్టడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

అయిదు వికెట్ల నష్టానికి 84 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్ ఆరంభమైంది. సగటున ఒక్కో ఓవర్‌కు ఓ బౌండరీ కొట్టారు స్టోక్స్-బెయిర్‌స్టో. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీలు బాదారు. దూకుడుగా ఆడారు. స్వేచ్ఛగా షాట్లు కొట్టారు. క్రీజ్ నుంచి బయటికి వచ్చి ఫోర్లు బాదడం కనిపించింది. ఈ క్రమంలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. బెయిర్ స్టో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్‌లో తొమ్మిది బౌండరీలు నమోదయ్యాయి.

బెన్ స్టోక్స్‌కు అదృష్టం కలిసి రాలేదు. రెండు సార్లు లైఫ్ పొందినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మహ్మద్ షమీ వేసిన 36వ ఓవర్ తొలి బంతికి స్టోక్స్ భారీ షాట్ ఆడగా.. అది ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దాన్ని అందుకోలేకపోయాడు శార్దుల్ ఠాకూర్. అతని చేతుల్లో పడి నేలకు వాలిందా బంతి. అప్పటికి స్టోక్స్ వ్యక్తిగత స్కోర్ 19 పరుగులు.

ఆ తరువాత శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో కూడా లైఫ్ పొందాడు గానీ.. ఆ తరువాతి బంతికే అవుట్ అయ్యాడు. మ్యాచ్ 38వ ఓవర్ మూడో బంతిని షాట్ ఆడాడు స్టోక్స్. మిడాఫ్ మీదుగా దూసుకెళ్తోన్న బంతిని కేప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అందుకోలేకపోయాడు. అది కూడా నేలపాలైంది. ఆ తరువాతి బంతికే స్టోక్స్‌ను బలి తీసుకున్నాడు శార్దుల్. మిడాఫ్‌లో క్యాచ్ డ్రాప్ చేసిన బుమ్రానే ఈ సారి అలాంటి పొరపాటు చేయలేదు. స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను ఎడమవైపునకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. 25 పరుగుల వద్ద స్టోక్స్ అవుట్ అయ్యాడు.

Story first published: Sunday, July 3, 2022, 16:51 [IST]
Other articles published on Jul 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+