Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌కు పొంచివున్న పెను గండం: మూడో రోజు కీలకం: బెయిర్‌స్టో: బెన్ స్టోక్స్ మీదే..

IND vs ENG 5th test day 3: England facing Follow-on threat, still require 132 runs to avoid it

లండన్: బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌పై భారత్‌ ఆధిపత్యాన్ని సాధించింది. మ్యాచ్‌పై పట్టు బిగించింది. కేప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులను సంధిస్తోన్నాడు. రెండోరోజు ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోగా అందులో మూడు.. బుమ్రా కూల్చినవే. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లాండ్ జట్టు ఫాలో ఆన్‌ను ఎదుర్కొనే ప్రమాదంలో పడినట్టే కనిపిస్తోంది.

బెయిర్‌స్టో-బెన్ స్టోక్స్..

బెయిర్‌స్టో-బెన్ స్టోక్స్..

తొలి ఇన్నింగ్‌లో 416 పరుగులు చేసిన భారత జట్టు- రెండో ఇన్నింగ్‌లో బంతితో విజృంభిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు అయిదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్‌కు పంపించారు బౌలర్లు. అలెక్స్ లీస్-6, జాక్ క్రాలీ-9, ఒల్లె పోప్-10, జో రూట్-31, జాక్ లీచ్-0 పరుగులకు అవుట్ అయ్యారు. జానీ బెయిర్‌స్టో-12, కేప్టెన్ బెన్ స్టోక్స్-0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఫాలో ఆన్ గండం..

ఈ ఇద్దరి మీదే ఇంగ్లాండ్ ఆశలు పెట్టుకుంది. ఏ ఒక్కరు అవుట్ అయినా.. జట్టు పతనం తప్పకపోవచ్చు. వెంటవెంటనే కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ జట్టు ఫాలో ఆన్ గండాన్ని అధిగమించలేకపోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఫాలో ఆన్ గండాన్ని దాటుకోవాలంటే ఇంకా 132 పరుగులు చేయాల్సి ఉంది. చివరి అయిదు వికెట్లు చేతిలో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో-బెన్‌ స్టోక్స్ క్రీజ్‌లో ఉన్నారు.

బౌలర్లను ఎదుర్కొనగలరా?

బౌలర్లను ఎదుర్కొనగలరా?

ఈ దశలో 132 పరుగులు చేయడం ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద కష్టం కాకపోవచ్చు గానీ.. నిప్పు కణికల్లాంటి బంతులను సంధిస్తోన్న భారత బౌలర్లను ఎదుర్కొని క్రీజ్‌లో నిల్చోవడం అంటే మాటలు కాదు. జో రూట్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్ టీమిండియా బౌలర్ల చేతికి చిక్కాడు. రెండో రోజు తొలి ఇన్నింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. వాతావరణంలో తేమను వినియోగించుకుని స్వింగ్, యార్కర్లతో బెంబేలెత్తిస్తోన్న బౌలర్లను ఎదుర్కొని ఎంతమాత్రం ఇంగ్లాండ్ బౌలర్లు క్రీజ్‌లో నిలదొక్కుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

భారత్ వైపే..

భారత్ వైపే..

ఇంగ్లాండ్ ఫాల్ ఆన్‌లో పడుతుందా? లేక ఈ గండాన్ని అధిగమిస్తుందా? అనేది తొలి రెండు గంటల్లోనే తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫాలో ఆన్‌లో పడితే.. గెలుపు ఇక పూర్తిగా భారత్ వైపు మొగ్గినట్టే అవుతుంది. ఇప్పుడున్న పిచ్‌పై ఫాల్ ఆన్ ఇన్నింగ్‌లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లు రాణించగలుగుతారనే ఆశలు ఎంతమాత్రమూ లేవు. పెద్దగా అనుభవజ్ఞులు లేకపోవడం ఇంగ్లాండ్‌కు ఇబ్బందికర పరిస్థితులను కల్పించినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Story first published: Sunday, July 3, 2022, 12:15 [IST]
Other articles published on Jul 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+