న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 5th test day 2: అదేం కొట్టుడురా భయ్: ఒక్క ఓవర్‌లో 35 పరుగులు పిండుకున్న బుమ్రా

 IND vs ENG 5th test day 2: Captain Jaspreet Bumrah score 35 runs in a single over

లండన్: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆట దూకుడుగా మొదలు పెట్టింది. ప్రారంభ ఓవర్లలో పరుగుల వరద పారించింది. నైట్ వాచ్‌మెన్ మహ్మద్ షమీ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. మాథ్యూ పాట్స్ సంధించిన 77వ ఓవర్‌లో బ్యాక్ అండ్ బ్యాక్ బౌండరీలు కొట్టాడు. బెన్ స్టోక్స్ వేసిన ఆ తరువాతి ఓవర్‌లోనూ రెండు ఫోర్లు నమోదయ్యాయి. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ చెరో బౌండరీ కొట్టారు.

జడేజా సెంచరీ..

రవీంద్ర జడేజా సెంచరీ సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 పరుగులతో నాటౌట్‌గా ఉన్న రవీంద్ర జడేజా తొలి సెషన్‌లోనే సెంచరీ కొట్టాడు. టెస్ట్ మ్యాచ్‌లల్లో అతనికి ఇది మూడో సెంచరీ. ఈ ఏడాదిలో అతను చేసిన రెండో సెంచరీ. మాథ్యూ పాట్ వేసిన 79వ ఓవర్ చివరి రెండు బంతులను బౌండరీలకు తరలించి మరీ.. రవీంద్ర జడేజా వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. తనదైన స్టైల్‌లో బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.

104 పరుగుల వద్ద..

టీమిండియా ఇన్నింగ్‌లో నమోదైన రెండో సెంచరీ ఇది. తొలి రోజు వికెట్ కీపర్ రిషభ్ పంత్ 146 పరుగులతో కదం తొక్కిన విషయం తెలిసిందే. కాగా 80వ ఓవర్‌లో మహ్మద్ షమీ అవుట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఆ ఓవర్ నాలుగో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోగా.. బంతి షమీ బ్యాట్‌ను తాకి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న లీచ్ దాన్ని అందుకున్నాడు. ఆ తరువాత టీమిండియా ఇన్నింగ్ ఎంతో సేపు నిలవలేదు. వ్యక్తిగత స్కోరు 104 పరుగుల వద్ద జడేజా అవుట్ అయ్యాడు. రెండు పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేరారు.

16 బంతుల్లో..

16 బంతుల్లో..

జస్‌ప్రీత్ బుమ్రా నాటౌట్‌గా నిలిచాడు. 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు బుమ్రా. కేప్టెన్సీ తెచ్చిన ఉత్సాహం అతన్ని ఓ పక్కా ప్రొఫెషనల్ బ్యాటర్‌గా మార్చివేసినట్టు కనిపించింది. టీ20 ఫార్మట్‌లో చెలరేగిపోయి ఆడాడు ఈ ఫాస్ట్ బౌలర్. రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో దుమ్ము దులిపాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్‌లో 35 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్ తొలి బంతికి బౌండరీ సాధించాడు. రెండో బంతి వైడ్ ప్లస్ ఫోర్‌గా వెళ్లింది. దీనితో అయిదు పరుగులు ఎక్స్‌ట్రాగా వచ్చాయి.

416 పరుగుల వద్ద

416 పరుగుల వద్ద

ఆ తరువాతి బంతి నో బాల్. దాన్ని సిక్స్‌గా మలిచాడు బుమ్రా. ఆ ఒక్క బంతికే అరుదుగా ఏడు పరుగులు రావడం విశేషమే మరి. 2,3,4, బంతులను బౌండరీకి తరలించాడు. అయిదో బంతికీ సిక్స్ కొట్టాడు. చివరి బంతికి ఒక పరుగుతో కలుపుకొని మొత్తం 35 పరుగులను బుమ్రా ఒక్కడే రాబట్టుకోవడం ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఇన్నేసి పరుగులు రాబట్టుకోవడం ప్రపంచ రికార్డ్. మొత్తంగా 416 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్‌కు తెర పడింది.

Story first published: Sunday, July 3, 2022, 13:30 [IST]
Other articles published on Jul 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X