For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వద్దనుకున్నవాడే ఆపద్బాంధవుడయ్యాడు: విమర్శకుల నోళ్లు మూయించాడు..

 IND vs ENG 5th test day 1: Rishabh Pant registered 2 centuries in last 5 innings in test cricket

లండన్: ఈ మధ్యకాలంలో టీమిండియాలో తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే. అది వికెట్ కీపర్ రిషభ్ పంత్‌. అతని బ్యాటింగ్ శైలిపై దుమారం చెలరేగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మొదలుకుని.. దక్షిణాఫ్రికా సిరీస్- చివరికి ప్రాక్టీస్ మ్యాచ్‌ వరకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నాడు. దాదాపుగా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చిందంటూ మాజీలు వ్యాఖ్యానించారు.

ఘాటు విమర్శలు..

ఘాటు విమర్శలు..

దీనికి కారణాలు లేకపోలేదు. దక్షిణాఫ్రికాతో ముగిసిన అయిదు టీ20 మ్యాచ్‌లల్లో సిరీస్‌లో అతను చేసింది 58 పరుగులు. అతని బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు, లెజెండరీ క్రికెటర్లు విమర్శలను సంధించారప్పట్లో. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, ఇర్ఫాన్ పఠాన్.. వంటి ప్లేయర్లు రిషభ్ పంత్‌ బ్యాటింగ్‌ను తప్పుపట్టారు. షాట్ల ఎంపికలో పంత్ తప్పు చేస్తోన్నాడని స్పష్టం చేస్తోన్నారు. అనవసరపు షాట్లతో చేజేతులా తన వికెట్‌ను పారేసుకుంటున్నాడంటూ తప్పుపట్టారు.

ఆపద్బాంధవుడు..

ఆపద్బాంధవుడు..

ఇప్పుడు అదే రిషభ్ పంత్.. జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో సెంచరీతో ఆదుకున్నాడు. 98 పరుగులకే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్.. సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే రేంజ్‌లో ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం క్రీజ్‌లో కుదురుకోవడంతో టీమిండియా పటిష్ఠస్థితికి చేరుకుంది.

 పట్టు బిగించడానికి..

పట్టు బిగించడానికి..

మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి రోజే 338 పరుగుల భారీ స్కోర్ చేయడానికి రిషభ్ పంత్- రవీంద్ర జడేజా ద్వయమే కారణం. ఈ ఇద్దరు రికార్డుస్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 320 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆరో వికెట్‌గా రిషభ్ పంత్ వెనుదిరిగాడు. 19 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 146 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 83, మహ్మద్ షమీ-0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు జడేజా కూడా సెంచరీ పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

చివరి అయిదు ఇన్నింగుల్లో..

చివరి అయిదు ఇన్నింగుల్లో..

కాగా- టెస్టుల్లో రిషభ్ పంత్ పరుగుల వరద పారిస్తూ వస్తోన్నాడు. చివరి అయిదు ఇన్నింగుల్లో రెండు సెంచరీలు, ఒక 90 ప్లస్ స్కోర్ చేశాడంటే అతని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికాపై 100, 96, 39, 50 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌పై అయిదో టెస్ట్.. తొలి ఇన్నింగ్‌లోనే 146 పరుగులు చేశాడు. వందకు పైగా స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసిన ఇన్నింగులే అవన్నీ. టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ తన పేరు మీదే లిఖించుకున్నాడీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్.

Story first published: Saturday, July 2, 2022, 9:34 [IST]
Other articles published on Jul 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+