Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయ్: రిషభ్ పంత్‌పై మాజీల ప్రశంసలు

 IND vs ENG 5th test day 1: Cricket fraternity praises Rishabh Pant for his heroic knock

లండన్: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. తొలి రోజే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 300లకు పైగా పరుగులను సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు స్కోర్ 300లను దాటడం అరుదు. దీన్ని అలవోకగా అందుకుంది టీమిండియా. ఇప్పటికే 2-1తేడాతో ఆధిక్యతలో ఉన్న టీమిండియా ఖాతాలో మరో గెలుపు పడే అవకాశాలకు బీజం వేసింది.

దీనికి కారణాలు లేకపోలేదు. దక్షిణాఫ్రికాతో ముగిసిన అయిదు టీ20 మ్యాచ్‌లల్లో సిరీస్‌లో అతను చేసింది 58 పరుగులు. అతని బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు, లెజెండరీ క్రికెటర్లు విమర్శలను సంధించారప్పట్లో. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, ఇర్ఫాన్ పఠాన్.. వంటి ప్లేయర్లు రిషభ్ పంత్‌ బ్యాటింగ్‌ను తప్పుపట్టారు. షాట్ల ఎంపికలో పంత్ తప్పు చేస్తోన్నాడని స్పష్టం చేస్తోన్నారు. అనవసరపు షాట్లతో చేజేతులా తన వికెట్‌ను పారేసుకుంటున్నాడంటూ తప్పుపట్టారు.

ఇప్పుడు అదే రిషభ్ పంత్ జట్టును సెంచరీతో ఆదుకున్నాడు. 98 పరుగులకే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్.. సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే రేంజ్‌లో ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం క్రీజ్‌లో కుదురుకోవడంతో టీమిండియా పటిష్ఠస్థితికి చేరుకుంది.

మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి రోజే 338 పరుగుల భారీ స్కోర్ చేయడానికి రిషభ్ పంత్- రవీంద్ర జడేజా ద్వయమే కారణం. ఈ ఇద్దరు రికార్డుస్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 320 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆరో వికెట్‌గా రిషభ్ పంత్ వెనుదిరిగాడు. 19 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 146 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 83, మహ్మద్ షమీ-0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు జడేజా కూడా సెంచరీ పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సెంచరీ దెబ్బకు అతన్ని విమర్శించిన వాళ్లే ఇప్పుడు పొడుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్‌లల్లో ఒకడిగా అభివర్ణిస్తున్నారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్, మహేంద్ర సింగ్ ధోనీ, జానీ బెయిర్‌స్టో, కుమార సంగక్కరతో పోల్చుతున్నారు. వారి కంటే బెస్ట్ బ్యాటర్‌గా ప్రశంసిస్తోన్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వెంకటేష్ ప్రసాద్, వసీం జాఫర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి జయ్ షా రిషభ్ పంత్‌ను ఆకాశానికెత్తేస్తోన్నారు.

Story first published: Saturday, July 2, 2022, 15:07 [IST]
Other articles published on Jul 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+