For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Cheteshwar Pujara: గాయంతో విలవిల్లాడుతూ.. పెయిన్ కిల్లర్ తీసుకుంటూ

Ind vs Eng 4th test: Cheteshwar Pujara slam fifty, after twisted his ankle as running between the wickets

లండన్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య.. ఓవల్ వేదికగా సాగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. టీమిండియా భారీ ఆధిక్యతను సాధించింది. ఇప్పటికే కోహ్లీసేన 171 పరుగుల ఆధిక్యతలో ఉంది. ఇంకా ఏడువికెట్లు చేతిలో ఉన్నాయి. కేప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నారు. వెలుతురు లేమి అడ్డుపడటం, వర్షం పడకపోవడమంటూ జరిగితే టీమిండియా భారీ స్కోర్‌ను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా రెండురోజులు మిగిలి ఉన్నందున.. ఫలితం తేలడం ఖాయం.

సత్తా చాటిన ఓపెనర్లు..

రెండో ఇన్నింగ్‌లో టీమిండియా కుదురుగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్‌లో విఫలమైన పిచ్‌పైనే పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. తమ సత్తా చాటారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ చేతేశ్వర్ పుజారా కూడా గాడిలో పడ్డాడు. మరోసారి హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 127 పరుగుల వద్ద అతను రాబిన్సన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 46 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. చేతేశ్వర్ పుజారా 61 పరుగులు చేశాడు.

భారీ స్కోర్‌పై..

వెలుతురు లేమి కారణంగా మూడోరోజు చివరి సెషన్‌ను నిర్దేశిత గడువు కంటే ముందే ముగించాల్సి వచ్చింది. సెషన్ ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 22, రవీంద్ర జడేజా తొమ్మిది పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నాలుగోరోజు వాతావరణం అనుకూలంగానే ఉంది. ఫలితంగా మ్యాచ్ సజావుగా సాగడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తొలి ఓవర్లలో వికెట్ కోల్పోకుండా నిలకడగా బ్యాటింగ్ చేయగలిగితే టీమిండియా భారీ స్కోర్ సాధిస్తుందనడంలో సందేహాలు అనవసరం.

సెకెండ్ టెస్ట్ స్కెచ్..

ప్రస్తుతం 171 పరుగులుగా ఉన్న ఆధిక్యతను 300లకు పైగా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రెండో టెస్ట్‌ చివరి సెషన్‌లో అనుసరించిన వ్యూహాన్నే విరాట్ కోహ్లీ ఇక్కడ కూడా అమలు చేసే వీలు ఉంది. 300లకు పైగా స్కోర్‌ను టార్గెట్‌గా నిర్దేశించిన తరువాత ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసి.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించే ఛాన్స్ ఉంది. నాలుగో రోజు చివరి సెషన్‌ నాటికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆరంభం కావచ్చు. అదే జరిగితే- ఇక భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత బౌలర్ల మీద ఉంటుంది.

బౌలర్ల మీదే భారం..

మూడో రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు ఏ స్థాయిలో సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ బౌలర్లు రెండో ఇన్నింగ్‌లో రాణించలేకపోయారు.. చతికిల పడ్డారు. తొలి ఇన్నింగ్‌లో వరుస వికెట్లను తీసుకున్న ఫాస్ట్ బౌలర్లు రెండో ఇన్నింగ్‌కు వచ్చే సరికి నీరసించారు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు క్రీజ్‌లో పాతుకుపోవడంతో వారిని అవుట్ చేయలేక చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితినే టీమిండియా బౌలర్లు కూడా ఎదుర్కొంటారా? అనేది తెలియాల్సి ఉంది.

గాయపడ్డ చేతేశ్వర్..

కాగా- ఇప్పటిదాకా ఈ సిరీస్‌లో విఫలమౌతూ వచ్చిన చేతేశ్వర్ పుజారా నిలదొక్కుకున్నట్టే. అతని బ్యాటింగ్ గాడిన పడినట్టే కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్‌లో అతను 61 పరుగులు చేశాడు. రాబిన్సన్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారీ స్కోర్‌ను అందుకునే క్రమంలో చేతేశ్వర్ పుజారా గాయపడ్డాడు. వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో అతని మడమ మడత పడింది. ఆ నొప్పితోనే అతను ఆడాడు. పెయిన్ కిల్లర్‌ను తీసుకుంటూ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించాడు.

Story first published: Sunday, September 5, 2021, 10:23 [IST]
Other articles published on Sep 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+