Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: లార్డ్స్‌లో విరాట్ కోహ్లీని కాపీ కొట్టిన శుభ్‌మన్ గిల్!

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం లార్డ్స్‌లో జరుగుతోంది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటిసారి లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టాడు. కానీ బ్యాట్‌తో గిల్ ఆరంభం అంత గొప్పగా లేదు. శుభ్‌మన్ గిల్ 16 పరుగులకే తన వికెట్‌ను కోల్పోయాడు. శుభ్‌మన్ గిల్ ప్రదర్శన అచ్చుగుద్దినట్లు విరాట్ కోహ్లీని పోలి ఉంది.గిల్ అనుకోకుండానే విరాట్ కోహ్లీని కాపీ చేశాడు. గణాంకాలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

లార్డ్స్‌లో గిల్, కోహ్లీ 'సేమ్ టు సేమ్' ప్రదర్శన!
విరాట్ కోహ్లీ లార్డ్స్‌లో తన మొదటి మ్యాచ్‌ను 13 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 2011లో ఆడాడు. ఆ వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీపై చాలా అంచనాలు ఉండగా.. కోహ్లీ మాత్రం కేవలం 16 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్రీమ్ స్వాన్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. అక్కడ వికెట్ కీపర్ క్రెయిగ్ కీస్‌వెట్టర్ క్యాచ్ పట్టాడు. ఇది సిరీ‌స్‌లోని నాల్గవ వన్డే మ్యాచ్. శుభ్‌మన్ గిల్ కూడా లార్డ్స్‌లో తన మొదటి ఇన్నింగ్స్‌లో 16 పరుగులకు ఔటయ్యాడు. గిల్ క్యాచ్‌ను కీపర్ జేమీ స్మిత్ పట్టాడు. ఇద్దరూ లార్డ్స్‌లో తమ మొదటి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేశారు. వారి క్యాచ్‌లను కీపర్లు పట్టారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే.. ఇద్దరూ నెలలోని 11వ తేదీన ఔట్ కావడం గమనార్హం.

IND vs ENG 3rd Test Shubman Gill Replicates Virat Kohli s Lord s Debut

విరాట్ కోహ్లీ లార్డ్స్‌లో ఆడిన మొదటి మ్యాచ్ టై
భారత్ 2011 వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌ను లార్డ్స్ మైదానంలో ఆడింది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 280 పరుగులు చేసింది. మ్యాచ్ సమయంలో వర్షం కురవడంతో డీఎల్ఎస్ పద్దతి ద్వారా లక్ష్యం 281 నుంచి 271కి తగ్గించబడింది. ఇంగ్లండ్‌కు 48.5 ఓవర్లలో ఈ పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ జట్టు 271 పరుగులకు ఔట్ అవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది. విరాట్ కోహ్లీకి లార్డ్స్‌లో మొదటి మ్యాచ్ అంతగా కలిసి రాలేదు.

Story first published: Saturday, July 12, 2025, 12:03 [IST]
Other articles published on Jul 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+